amazon announced blockbuster deal on Samsung 55 Mini LED smart tv
ప్రైమ్ డే 2026 సేల్ ముగిసిన తర్వాత కూడా అమెజాన్ ఇండియా భారీ స్మార్ట్ టీవీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈరోజు Samsung 55 Mini LED స్మార్ట్ టీవీ అమెజాన్ బ్లాక్ బస్టర్ డీల్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇండియాలో జస్ట్ రెండు నెలల క్రితం విడుదల చేసిన శాంసంగ్ లేటెస్ట్ 55 ఇంచ్ మినీ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇండియా రెండు భారీ డీల్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ బడ్జెట్ ధరలో మీకు లభిస్తుంది.
2026 మే నెలలో Vision AI టీవీ సిరీస్ లో భాగంగా శాంసంగ్ విడుదల చేసిన UA55M2EHAULXL మోడల్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ని ఇండియాలో రూ. 49,990 రేటుతో విడుదల చేసింది. ఈరోజు కూడా ఇదే ధరతో సేల్ చేస్తోంది. అయితే, ఈ స్మార్ట్ టీవీ పై రెండు బ్లాక్ బస్టర్ డీల్స్ ఈరోజు జత చేసింది.
ఈ స్మార్ట్ టీవీ పై మొదట రూ. 3,000 భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించిన శాంసంగ్ రూ. 3,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అది కూడా All banks Credit and Debit Card ఆఫర్ అందించింది. అంటే, ఈ టీవీని ఏదైనా బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు తో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఆఫర్స్ తో ఈ టీవీ రూ. 43,990 డిస్కౌంట్ ధరలో ఈరోజు మీకు లభిస్తుంది. ఇటీవల జరిగిన ప్రైమ్ డే సేల్ కంటే కూడా ఈరోజు ఈ స్మార్ట్ టీవీ తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: OnePlus N6x కొత్త టీజర్ మరియు అప్డేట్ విడుదల: న్యూ లుక్ కన్ఫర్మ్.!
ఇది శాంసంగ్ లేటెస్ట్ గా అందించిన 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ మరియు ఇది మంచి స్లీక్ బెజెల్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ టీవీ 4K UHD (3840 × 2160) రిజల్యూషన్ మరియు 120Hz (DLG) రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది మినీ ఎల్ఈడి బ్యాక్ లైట్ టెక్నాలజీ, ప్యూర్ స్పెక్ట్రమ్ కలర్, కలర్ బూస్టర్ మరియు HDR10+ సపోర్ట్ తో గొప్ప పిక్చర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
ఇందులో గేమింగ్ కోసం VRR, ALLM మరియు HGiG వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది శాంసంగ్ Vision AI ఫీచర్ తో వస్తుంది కాబట్టి AI ఆధారిత సమాచారం పొందవచ్చు మరియు కంటెంట్‌కు సంబంధించిన ప్రశ్నలు కూడా అడగవచ్చు. ఈ టీవీ Tizen Smart TV OS పై నడుస్తుంది మరియు అలెక్సా, Bixby, గూగుల్ అసిస్టెంట్ మరియు ఆపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ తో పాటు వెబ్ బ్రౌజర్ ఫీచర్ తో వస్తుంది.
ఇందులో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఇది టోటల్ 30W సౌండ్ అందిస్తుంది, అయితే, ఈ టీవీ కలిగిన OTS Lite, అడాప్టివ్ సౌండ్ మరియు డైనమిక్ సౌండ్ ప్యాక్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఆప్టికల్, ఈథర్నెట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.