LG Smart Tv పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!
LG Smart Tv ఈరోజు గొప్ప డిస్కౌంట్ బడ్జెట్ ధరలో లభిస్తోంది
స్మార్ట్ టీవీ పై ఈరోజు కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అందించింది
ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు
LG Smart Tv ఈరోజు గొప్ప డిస్కౌంట్ బడ్జెట్ ధరలో లభిస్తోంది. LG ఇండియా లో రీసెంట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈరోజు కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. అందుకే, ఈరోజు ఈ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో లభిస్తుంది. కొత్త స్మార్ట్ టీవీ కొనాలని సెర్చ్ చేస్తున్న వారు ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyLG Smart Tv : ఆఫర్
ఈ ఎల్ జి యొక్క 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43UR7500PSC ఈరోజు ఈ డిస్కౌంట్ ఆఫర్ తో లాభిస్తుంది. ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ ఈరోజు 38% డిస్కౌంట్ తో రూ. 30,970 ధరకు లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 4,000 రూపాయల తగ్గింపు అందుకునే అవకాశం అందించింది.
అవేమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. Buy From Here
Also Read: Pushpa 2 సినిమా OTT లో చూడాలని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!
LG Smart Tv : ఫీచర్స్
ఈ ఎల్ జి 43 ఇంచ్ స్మార్ట్ టీవీ α5 AI Processor 4K Gen6 తో పని చేస్తుంది మరియు 1.5GB ర్యామ్ తో పాటు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు ఫిలిం మేకర్ మోడ్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 4K అప్ స్కేలింగ్, AI బ్రైట్నెస్ మరియు బిల్ట్ ఇన్ Alexa వంటి ఫీచర్స్ తో వస్తుంది.

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ AI Sound (వర్చువల్ 5.1) సపోర్ట్ తో వస్తుంది మరియు 20W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ బ్లూటూత్ సరౌండ్ రెడీ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile