కొత్త రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించిన వోడాఫోన్ ఐడియా

కొత్త రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించిన వోడాఫోన్ ఐడియా
HIGHLIGHTS

ఎంపిక చేసిన సర్కిళ్లకు మాత్రమే పరిమితఅవుతుందని సంస్థ తెలిపింది.

వోడాఫోన్ మరొక సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకువచ్చింది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 499 రూపాయల ధరలో వస్తుంది. ఈ ప్లానుతో మీరు 70 రోజుల చెల్లుబాటును పొందవచ్చు. ఈ రూ. 499 రూపాయల ప్రీపెయిడ్ ప్లానుకు సంబంధించి, ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ వోడాఫోన్ మరియు ఐడియా సెల్యులార్ చందాదారులకు అందుబాటులో ఉందని, అయితే ఇది ప్రారంభంలో ఎంపిక చేసిన సర్కిళ్లకు మాత్రమే పరిమితఅవుతుందని సంస్థ తెలిపింది. గత ఏడాది డిసెంబరులో,  వోడాఫోన్ మరియు ఐడియా నెట్‌వర్క్‌లను నడుపుతున్న వొడాఫోన్ ఐడియా, తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లను సవరించింది మరియు భారతదేశంలో దాని వినియోగదారు (ఆర్‌పియు) సగటు ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో కొత్త ప్లాన్స్ తీసుకువచ్చింది.

ఇది కాకుండా, ప్రీపెయిడ్ ప్లాన్ రూపంలో మరో ప్లాన్ 555 రూపాయల ప్లాన్ కూడా ఉంది. అలాగే, ఇప్పుడు 77 రోజుల చెల్లుబాటును పొందుతారు. రూ .555 వోడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ ముందుగా 70 రోజులకు చెల్లుబాటుతో వచ్చింది, కానీ ఇప్పుడు ఈ ధర వద్ద మీరు ఈ ప్లాన్‌ లో మరింత ప్రామాణికతను పొందుతారు.

ఇక వొడాఫోన్ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే, ఈ ప్లాన్‌ లో అంటే రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్‌లో మీకు అపరిమిత కాలింగ్ లోకల్, ఎస్‌టిడితో పాటు రోమింగ్ మొదలైనవి అందుతాయి. అలాగే మీరు రోజుకు 1.5 GB  డేతాని పొందుతారు -స్పీడ్ డేటా కూడా అందుబాటులో ఉంది. మీరు ఇవన్నీ పూర్తి 70 రోజుల వ్యాలిడిటీతో అందుకుంటారు. అలాగే, ఈ ప్లానులో మీరు డైలీ 100 SMS ను కూడా పొందుతారు, దీనిని మీరు లోకల్ మరియు నేషనల్ కు కూడా ఉపయోగించవచ్చు.

ఈ ప్లాన్ గురించి మాట్లాడితే, సంస్థ ఎంచుకున్న కొన్ని సర్కిళ్లలో 499 రూపాయల ధరతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను పొందవచ్చు. అయితే, ప్రస్తుతానికి మీరు దీన్ని ఢిల్లీ  మరియు NCR తో పాటు మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్ ఘడ్  మొదలైన సర్కిళ్లలో అందుబాటులో వుంది. ఇది కాకుండా, ఐడియా నెట్‌వర్క్‌లో ఉన్న వినియోగదారులకు కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది మరియు త్వరలోనే ఈ ప్లాన్ అన్ని సర్కిళ్లలో ప్రకటించవని అంచనావేస్తున్నారు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo