వోడాఫోన్ ఐడియా (Vi) బంపర్ అఫర్: పూర్తి నెల రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ ప్లాన్స్ అందించింది..!!

HIGHLIGHTS

వోడాఫోన్ ఐడియా రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను ప్రకటించింది

క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్

పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ అన్లిమిటెడ్ ప్లాన్స్

వోడాఫోన్ ఐడియా (Vi) బంపర్ అఫర్: పూర్తి నెల రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ ప్లాన్స్ అందించింది..!!

వోడాఫోన్ ఐడియా రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను ప్రకటించింది. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీతో రెండు అన్లిమిటెడ్ ప్లాన్స్ ను వోడాఫోన్ ఐడియా తన పోర్ట్ ఫోలియోకి జత చేసింది. వాస్తవానికి, ప్రతి టెలికం సంస్థ కూడా పూర్తి నెల రోజులు, అంటే  30 మరియు 31 రోజుల వరకు చెల్లుబాటు అయ్యేలా కనీసం ఒక రీఛార్జ్ ప్లాన్‌ అయినా  కలిగి ఉండాలని ఆదేశించిన TRAI ఆదేశాలను అనుసరించి వోడాఫోన్ ఐడియా ఈ కొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్ లను క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ అంటారు. మరి కొత్తగా వోడాఫోన్ ఐడియా తీసుకువచ్చిన ఈ పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ అన్లిమిటెడ్ ప్లాన్స్ తీసుకువచ్చే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.327 మరియు రూ.337 రూపాయల ధరతో ఈ వన్ మంత్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకువచ్చింది. వీటిలో రూ.327 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తే, రూ.337 ప్లాన్ మాత్రం నెలలో వుండే రోజులతో సంభంధం లేకుండా పూర్తి నెలరోజుల చెల్లుబాటుతో వస్తుంది. అర్ధమయ్యేలా చెప్పాలంటే, ఈ నెల ఏ తేదికి మీరు రీఛార్జ్ చేస్తారో వచ్చే నెల ఆ తేదీ వరకు చెల్లుబాటు అవుతుంది. అయితే, ఈ రెండు ప్లాన్స్ కూడా లిమిటెడ్ డేటాని మాత్రమే అందిస్తాయి.

Vodafone Idea.jpg

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.327 ప్లాన్ ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.327 ప్రీపెయిడ్ ప్లాన్ 30 వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 25GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, అన్ని నెట్ వర్క్  లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అధనంగా, Vi మూవీస్ మరియు TV యొక్క ఉచిత సభ్యత్వాలను పొందుతారు.                            

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.337 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.337 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి నెల రోజుల (30 లేదా 31 రోజులు) వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 28GB  హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, అన్ని నెట్ వర్క్  లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అధనంగా, అధనంగా, Vi మూవీస్ మరియు TV యొక్క ఉచిత సభ్యత్వాలను పొందుతారు.

మరిన్ని బెస్ట్ ఎయిర్టెల్ ప్లాన్స్ మరియు రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo