56 రోజుల అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 2GB డేటా కేవలం 189 రూపాయలు మాత్రమే, వోడాఫోన్ బంపర్ ప్లాన్
వోడాఫోన్ యొక్క ఈ ఆఫరుతో, దాదాపుగా రెండు నెలలపాటు అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు.
వోడాఫోన్ ఇప్పుడు సరికొత్త అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లానుతో తన వినియోగదారులను మంచి ప్రయోజనాలను తెస్తుంది. కాలింగ్ కోసం ఎక్కువగా ఆధారపడేవారిని, టార్గెట్ చేసుకుని, వోడాఫోన్ కొత్త Rs 189 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లానుతో వినియోగదారులు 56 రోజులవరకు కూడా అపరిమితంగా కాలింగ్ చేసుకోవచ్చు మరియు దానితో పాటుగా 2GB డేటా ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
SurveyVodafone Rs 189 ప్రీపెయిడ్ ప్లానుతో, 56 రోజుల పాటుగా అపరిమిత కాలింగ్ సౌలభ్యాన్ని పొందవచ్చు మరియు అదనంగా 2GB డేటా కూడా మీకు అందుతుంది. అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్ కూడా రోజుకు 250 నిమషాలు లేదా వారానికి 1000 నిమిషాల వరకు కాలింగ్ చేసుకునే విధమైన షరతులతో వస్తుంది. వోడాఫోన్ నుండి వచినటువంటి చాల ప్లానులు కూడా ఇటువంటి షరతులతో వచ్చాయి. ఈ ప్రీపెయిడ్ ప్లానుతో మీకు ఎటువంటి SMS ప్రయోజనాలను అందించడంలేదు వోడాఫోన్.
అయితే, జియో యొక్క 349 రూపాయల ప్లాను అందించే అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 1.4GB డేటా మరియు 100SMS ప్రయోజనాలతో పోలిస్తే, వోడాఫోన్ యొక్క ఈ ప్లాను ద్వారా తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందుకోవచ్చు. ముఖ్యంగా, కేవలం కాలింగ్ కోసం ఆధారపడేవారికి ఈ రూ 189 ప్రీపెయిడ్ ప్లాన్ మంచి లాభాన్నితెచ్చే ప్లానుగా ఉంటుంది
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile