ఈ 10 అంకెల మొబైల్ నంబర్స్ ఇక ఉండవు అంటున్నTRAI.!

HIGHLIGHTS

ఈ 10 అంకెల మొబైల్ నంబర్స్ ఇక ఉండవు అంటున్నTRAI

ఇక నుండి ఇటువంటి ఆటలు సాగవని ట్రాయ్ కొత్త నిర్ణయం హెచ్చరిస్తుంది

10 రోజుల వ్యవధిని ట్రాయ్ చివరి అవకాశంగా ఇచ్చింది

ఈ 10 అంకెల మొబైల్ నంబర్స్ ఇక ఉండవు అంటున్నTRAI.!

ఈ 10 అంకెల మొబైల్ నంబర్స్ ఇక ఉండవు అంటున్నTRAI. తమ మార్కెట్ ప్రమోషన్స్ కోసం 10 అంకెల మొబైల్ నంబర్ లను ఉపయోగించే టెలీ మార్కెటింగ్ కంపెనీలకు చెక్ పెట్టడానికి ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది  ఆగడాలను కట్టడి చేసేందుకు తీసుకున్నట్లు తెలిపింది. దీనివలన ఇష్టానుసారం 10 అంకెల మొబైల్ నంబర్ లతో ప్రమోషనల్ కాల్స్ చేసే వారి ఆగడాలను కట్టడి చేయనున్నది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వాస్తవానికి, టెలీ మార్కెటింగ్ కంపెనీలకు సాధారణ 10 మొబైల్ నంబర్ల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉండే నంబర్స్ ను ఉపయోగిస్తాయి. ఎందుకంటే, టెలీ మార్కెటింగ్ కాల్స్ లేదా మెసేజీలు సాధరణ వినియోగదారుల నుండి భిన్నంగా మరియు అర్ధమయ్యేలా ఉండేదుకు ఇలా చేస్తారు. అయితే, చాలా టెలీ మార్కెటింగ్ కంపెనీలు ఈ నియమాలను తుంగలో తొక్కి, వారి ఇష్టానుసారం సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్స్ ను ఉపయోగించి వారి ప్రమోషన్స్ ను కొనసాగిస్తున్నాయి. అయితే, ఇక నుండి ఇటువంటి ఆటలు సాగవని ట్రాయ్ కొత్త నిర్ణయం హెచ్చరిస్తుంది. 

ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది?

సాధరణ 10 అంకెల నంబర్ లతో యూజర్లను విసిగిస్తున్న టెలీ మార్కెటింగ్ కంపెనీల పైన కఠినంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా, టెలీ మార్కెటింగ్ కంపెనీలు ఆచరిస్తున్న ఈ అనైతిక పనులను TRAI పూర్తిగా కట్టడి చెయ్యాలని యోచిస్తోంది. ఇక ఎప్పటి నుండి ఇది అమలులోకి వస్తుంది? అని చూస్తే, రిజిష్టర్ చెయ్యకుండా ప్రమోషనల్ కాల్స్ కోసం ఉపయోగించే నంబర్ లను వెంటనే ఆపివేయాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ట్రాయ్ ఆదేశాలు జారీచేసింది. దీనికోసం, 30 రోజుల వ్యవధిని కంపెనీలకు ట్రాయ్ చివరి అవకాశంగా ఇచ్చింది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo