రెండు Mobile Number నెంబర్ లు వాడే వారికి ఇక దబిడి దిబిడే.!

HIGHLIGHTS

ఇప్పుడు ఒక మొబైల్ నెంబర్ ను ఉపయోగించడం కూడా కష్టంగా మారింది

రెండు Mobile Number లు వాడే వారికి ఇక దబిడి దిబిడే అని క్లియర్ గా అర్థం అవుతోంది

టెలికాం కంపెనీలు టారిఫ్ ఛార్జ్ లను 25% వరకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది

రెండు Mobile Number నెంబర్ లు వాడే వారికి ఇక దబిడి దిబిడే.!

ఒకప్పుడు ఎన్ని కావాలంటే అన్ని మొబైల్ నెంబర్ లు ఒకేసారి ఉపయోగించే అవకాశం వుంది. అయితే, ఇప్పుడు ఒక మొబైల్ నెంబర్ ను ఉపయోగించడం కూడా కష్టంగా మారింది. అయితే, ఇప్పుడు కొత్త వచ్చిన ఒక వార్త వింటుంటే ఇక రెండు Mobile Number లు వాడే వారికి ఇక దబిడి దిబిడే అని క్లియర్ గా అర్థం అవుతోంది. ఇప్పటికే టెలికాం రూల్స్ మరియు రీఛార్జ్ లతో సతమవుతున్న యూజర్లకు మరొక పిడుగులాంటి వార్తను వినాల్సి వస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

2024 జనరల్ ఎలక్షన్ ముగిసిన తర్వాత టెలికాం కంపెనీలు టారిఫ్ ఛార్జ్ లను 25% వరకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నష్టాల్లో నడుస్తున్న టెలికాం కంపెనీలు వాటి యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) ను పెంచేందుకు ఈ చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ది ఎకనామిక్ టైమ్స్ ఈ కొత్త వార్తను అందించింది.

Mobile Number Tarif Hike
Mobile Number Tarif Hike

రిపోర్ట్ ప్రకారం, అతి తక్కువ కాలంలో నాలుగవ సారి కూడా టెలికాం కంపెనీలు టారిఫ్ ఛార్జ్ లను పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, హెవీ 5G ఇన్వెస్ట్మెంట్ తర్వాత అర్ధవంతమైన ప్రాఫిటబిలిటీ ని ఆశించడం, ఈ చర్యలకు దారితీసిందని కూడా తెలిపింది. ఇదే కనుక జరిగితే ఇప్పటికే పెరిగిన రీఛార్జ్ ఖర్చు మరింత భారంగా మారుతుంది.

Also Read: Vivo X100s Pro: 8K UHD కెమెరా మరియు Dimensity 9300+ చిప్ సెట్ తో వచ్చింది.!

మరి రెండు Mobile Number వాడితే ఏమిటి ఇబ్బంది?

ఇప్పటికే ఒక మొబైల్ నెంబర్ వాడుకలో ఉండాలంటే, నెలకు కనీసం రూ. 150 రూపాయలైనా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవేళ టారిఫ్ రేట్లు పెరిగి కొత్త రేట్లు అమలులోకి వస్తే, ఒక్కొక్క నెంబర్ ను 28 రోజులు మెయింటైన్ చేయడానికి కనీసం రూ. 170 నుంచి రూ. 180 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.

అంటే, రెండు మొబైల్ నెంబర్ లను రెగ్యులర్ గా రీఛార్జ్ చేస్తూ మెయింటైన్ చేయడానికి కనీసం రూ. 350 రూపాయలు యావరేజ్ గా నెలకు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనికి తోడు డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ లను ఎంచుకోవాలంటే మరింత భారాన్ని భుజాన వేసుకోవాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo