త్వరలో దేశమంతటా BSNL 4G సేవలు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 22 Mar 2019
HIGHLIGHTS
  • ప్రస్తుతం కొన్ని వివిధ సర్కిళ్లలో తన 4G VoLTE సేవలను అందిస్తున్న BSNL టెలికం సంస్థ.

త్వరలో దేశమంతటా BSNL 4G  సేవలు
త్వరలో దేశమంతటా BSNL 4G సేవలు

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయినటువంటి BSNL ఇప్పటి వరకు కేవలం 3G సేవలను మాతరమే అందిచడంవల్ల, ప్రస్తుతం నడుస్తున్న 4G యుగంలో ఇది ఇప్పటివరకు కొంచం వెనుకబడివున్నట్లు ఒక అభిప్రాయముండేది. అయితే, ఇప్పుడు BSNL దేశమంతటా తన 4G సేవలను అందించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి, దేశంలోని పలు సర్కిళ్లలో తన 4G VoLTE  అందిస్తోంది.

ఇటీవలే కంపెనీకి 2100MHz స్పెక్ట్రం కూడా అందించబడింది కాబట్టి ఇప్పుడు 4G యొక్క నిరంతర సేవలను అందించడానికి పూర్తిగా సిద్ధమవుతోంది.  ఇప్పుడు గుజరాత్ మరియు మరికొన్ని సర్కిళ్లలో తమ 4G VoLTE సర్వీసును మొదలుపెట్టినట్లు, BSNL తెలియచేసింది. అయితే, ప్రస్తుతానికి 4G నెట్వర్క్ రిలే కోసం 3G యొక్క వాయు తరంగాలనే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జనవరిలో BSNL యూక ప్రకటనలను ఒకసారి తిరిగి పరిశీలిస్తే, చెన్నై లో BSNL యొక్క 4G SIM అప్డేట్ చేసుకునవారికి 2GB ఉచిత డేటా ని కూడా అందించిన విషయం మనకు తెలుసు.

అయితే, ప్రస్తుతం తన 3G నెట్వర్క్ లో అన్నింటి టెలికం కంపెనీల కంటే కూడా ఉత్తమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అఫర్ చేస్తోంది. అలాగే, తెలుగు రాష్ట్రాలతో సహా కొన్నిసర్కిళ్లలో కొన్ని ప్రీపెయిడ్ ప్రణాళికల పైన ఆత్యదికంగా, రోజుకు 2GB డేటాని ఉచితంగా అందిస్తోంది. ఇంకా కొత్త రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 6 నెలల అన్లిమిటెడ్ కాలింగ్ వాటి ఉత్తమైన ప్లాన్లను కూడా పరిచయం చేసింది. ఇక 4G  సర్వీస్ ప్రారంభమైనది కాబట్టి ఎటువంటి ఉత్తమ ప్లాన్స్ తీసుకువస్తుందో చూడడానికి మరి కొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది.                        

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status