రిలయన్స్ జియో తన యూజర్ల కోసం గొప్ప అఫర్ ప్రకటించింది. జియో యూజర్లు ఈరీఛార్జ్ చేస్తే 12GB అదనపు డేటా ఉచితంగా అందుతుంది. అంటే, యూజర్లు ప్లాన్ ద్వారా అందుకునే రెగ్యులర్ ప్రయోజనాలతో పాటుగా 12GB అదనపు డేటా లాభాన్ని కూడా ఈ రీఛార్జ్ ద్వారా అందుకుంటారు. జియో యూజర్లకు అధిక ప్రయోజనాలను ఉచిత డేటాని అఫర్ చేసే ఆ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
రిలయన్స్ జియో కొత్తగా తీసుకువచ్చిన రూ.899 మరియు రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ పైన ఈ 12GB ఉచిత డేటా అఫర్ ను యాడ్ చేసింది. ఈ రెండు ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలను ఇక్కడ చూడవచ్చు.
జియో యొక్క లేటెస్ట్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.
Jio Rs.899 Plan
జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile