JioTV Premium Plans: 14 OTT సబ్ స్క్రిప్షన్ తో కొత్త ప్లాన్స్ ప్రకటించిన జియో.!

HIGHLIGHTS

14 OTT సబ్ స్క్రిప్షన్ లతో జియో కొత్త ప్లాన్ లను లాంచ్ చేసింది

జియోటీవీ ప్రీమియం కోసం ఈ కొత్త ప్లాన్ లను అందించింది

జియోటీవీ ప్రీమియం కోసం మూడు కొత్త ప్లాన్ లను అందించింది

JioTV Premium Plans: 14 OTT సబ్ స్క్రిప్షన్ తో కొత్త ప్లాన్స్ ప్రకటించిన జియో.!

రిలయన్స్ జియో త్వరలోనే JioTV Premium Plans ను మరిన్ని ఓటిటి సబ్ స్క్రిప్షన్ లతో తీసుకు రావచ్చని చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు నిజమయ్యింది. జియోటీవీ ప్రీమియం కోసం ఇప్పుడు 14 OTT సబ్ స్క్రిప్షన్ లతో జియో కొత్త ప్లాన్ లను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ లను ఒక నెల (28 రోజులు), మూడు నెలలు (84 రోజులు) మరియు ఒక సంవత్సరం (365) రోజుల వ్యాలిడిటీతో బండిల్ చేసింది. ఈ ప్లాన్ లను అని ప్రయోజనాలతో జత చేయడం కూడా ఒక్కింత ఆశ్చర్యపరుస్తోంది. మరి జియో తీసుకు వచ్చిన ఈ సరికొత్త జియోటీవీ ప్రీమియం ప్లాన్స్ పైన ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JioTV Premium Plans

ముందు నుండి అంచనా వేస్తునట్లుగానే జియో ఈరోజు జియోటీవీ ప్రీమియం కోసం మూడు కొత్త ప్లాన్ లను అందించింది. ఈ ప్లాన్ లను రూ. 398, రూ. 1,198 మరియు రూ. 4,498 ధరలతో ప్రకటించింది. ఈ ప్లాన్స్ అందించే అన్ని లాభాలను వివరంగా చూద్దాం.

JioTV Premium Plans with 14 ott apps subscription
జియోటీవీ ప్రీమియం ప్లాన్

ఇక్కడ అందించిన మూడు ప్లాన్ లతో JioCinema Premium, Disney+ Hotstar, Zee5, SonyLiv, Prime Video (Mobile), Lionsgate Play, Discovery+, Docubay, SunNXT, Hoichoi, Planet Marathi, Chaupal, EpicOn మరియు Kanccha Lannka మొత్తం 14 OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది.

రూ. 398 జియోటీవీ ప్రీమియం ప్లాన్

ఈ ప్లాన్ టోటల్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో 28 రోజుల పాటు పైన తెలిపిన వాటిలో 12 ఒటిటి లకు సబ్ స్క్రిప్షన్ అంధిస్తుంది. అలాగే, 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని అందిస్తుంది.

Also Read : Phone Switch Off: డిసెంబర్ 20న ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చెయ్యాలట.!

రూ. 1,198 జియోటీవీ ప్రీమియం ప్లాన్

ఈ ప్లాన్ పూర్తిగా 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ తో 84 రోజుల పాటు పైన తెలిపిన 14 ఓటీటీ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అంధిస్తుంది. అలాగే, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని 84 రోజుల పాటు అందిస్తుంది.

రూ. 4,498 జియోటీవీ ప్రీమియం ప్లాన్

ఇది ఒక సంవత్సరం 365 వ్యాలిడిటీ అందించే ప్లాన్ అని జియో తెలిపింది. ఈ ప్లాన్ తో సంవత్సరం మొత్తం 14 ఓటీటీ లకు సబ్ స్క్రిప్షన్ అంధిస్తుంది. అంతేకాదు, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని సంవత్సరం మొత్తం అందిస్తుంది. ఈ ప్లాన్ పైన EMI ఆఫర్ ను కూడా జియో ఆఫర్ చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo