షావోమి రెడ్మి5 వినియోగదారులకి 2200 క్యాష్ బ్యాక్ మరియు 100GB డేటా అఫర్ ని ప్రకటించిన రిలయన్స్ Jio

HIGHLIGHTS

ఈ అఫర్ కేవలం Rs. 198 మరియు Rs. 299 ప్లాన్లతో మాత్రమే వర్తిస్తుంది.

షావోమి రెడ్మి5  వినియోగదారులకి 2200 క్యాష్ బ్యాక్ మరియు 100GB డేటా అఫర్ ని ప్రకటించిన రిలయన్స్ Jio

రిలయన్స్ జియో, ఇప్పుడు షావోమి రెడ్మి 5 స్మార్ట్ ఫోన్ కోనుగోలు చేసిన జియో చందాదారులకోసం 2200 రూపాయల గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్ మరియు 100GB డేటాని  కూడా అందిస్తోంది. అయితే, ఈ క్యాష్ బ్యాక్ కేవలం Rs. 198 మరియు Rs. 299 ప్లాన్లతో మాత్రమే వర్తిస్తుంది.  ప్రకటించిన, ఈ క్యాష్ బ్యాక్ మొత్తం 2200 రూపాయలు కూడా ఒక్కొకటి 50 రూపాయల విలవగల 44 వోచర్లతో అందించబడుతుంది. ఈ వోచర్లను అర్హత గల డివైజ్ లకు, My Jio App ద్వారా  Rs. 198 మరియు Rs. 299 ప్లాన్ రీచార్జి తో అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ అఫర్ లో భాగంగా ప్రకటించిన, 100GB అదనపు డేటాని ప్రతిఒక్కదానికి 10GB డేటాతో సమానంగా వుండే 10 వోచర్లుగా అందిస్తుంది. ఈ వోచర్లను అర్హత గల డివైజ్ లకు, My Jio App ద్వారా  Rs. 198 మరియు Rs. 299 ప్లాన్ రీచార్జి తో అందిస్తుంది.

అర్హత గల డివైజ్ : ఈ ఆఫర్ కేవలం మార్చి 20 వ తేదీ తరువాత కొనుగోలు చేసిన, షావోమి రెడ్మి 5 యొక్క అన్ని వేరియనట్లకు వర్తిస్తుంది.

అర్హత గల చందాదారులు : ఈ ఆఫర్ పొందడానికి క్రింద తెలిపిన అర్హతలు కలిగి ఉండాలి

1.  పైన తెలిపిన విధంగా అర్హత గల డివైజ్ కొనుగోలు చేసివుండాలి

2.  జియో సర్వీసులకు చందాదారులయ్యి ఉండాలి

3. జియో యొక్క "Jio Prime"  సభ్యత్వం నమోదు చేసివుండాలి

ఆఫర్ వోచర్ల కాలపరిమితి

ఈ 44 వోచర్ల క్యాష్ బ్యాక్ ని, 20వ తేది మార్చి, 2018 నుండి 31వ తేది మే, 2022  వరకు వాడుకునే వీలుంటుంది. అలాగే, 100GBల అదనపు డేటాని 20వ తేది మార్చి, 2018 నుండి 30వ తేది సెప్టెంబర్, 2019 లోపు వాడుకోవల్సి ఉంటుంది. ఈ అఫర్ కేవలం Rs. 198 మరియు Rs. 299 ప్లాన్ రీచార్జితో మాత్రమే వర్తిస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo