రిలయన్స్ జియో చందాదారుల కోసం “Jio Diwali 100% Cash Back” అఫర్ ని ప్రకటించింది
ఆ దీపావళి ఆఫర్తోపాటుగా, కొత్త వార్షిక అన్లిమిటెడ్ 1,699 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ని కూడా ప్రకటించింది.
రానున్న దీపావళి పండుగ సందర్భంగా, రిలయన్స్ జియో వినియోగదారుల కోసం కొత్త "Jio Diwali 100% Cash Back" అఫర్ ని తెచ్చింది. ఈ పండుగ అఫర్ తోపాటుగా ఒక కొత్త 1,699 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ని కూడా ప్రకటించింది. ఈ ఆఫర్ Rs.149 ప్రీపెయిడ్ ప్లాన్ మొదలుకొని కొత్తగా వచ్చిన వార్షిక అన్లిమిటెడ్ Rs. 1699 ప్లాన్ వరకు వర్తిస్తుంది. ఈ ప్లాన్ ప్రస్తుత చందాదారులు మరియు కొత్తగా చేరనున్న చందాదారులకు కూడా వర్తిస్తుంది మరియు ఈ ఆఫర్ నవంబర్ 30 వరకు అందుబాటులోవుంటుంది. అయితే, ఈ ఆఫర్ ద్వారా అందుకునే కూపన్లను మాత్రం 2018, డిసెంబర్ 31 వ తేదీలోపుగా వాడుకోవాల్సివుంటుంది.
Surveyఈ జియో దివాళీ 100% కాష్ బ్యాక్ ఆఫర్తో మీరు 149 రూపాయలు మరియు ఆపైన చేసే ప్రతి రీచార్జి ద్వారా, అంతే మొత్తం గల కూపన్ ని పొందుతారు. ఈ కూపన్లను మై జియో ఆప్ లోని మై కూపన్స్ విభాగంలో చూడవచ్చు. వినియోగదారులు ఈ అఫర్ సమయంలో ఎన్నిసార్లు రీచార్జి చేస్తే అన్నిసార్లు కూపన్లను పొందుతారు. అయితే ఈ కూపన్లను మాత్రం, రిలయన్స్ డిజిటల్ లేదా మై జియో స్టోర్లలో 5000 లేదా అంతకంటే ఎక్కువ ఇన్వాయిస్ పైన మాత్రమే వాడుకునే అవకాశముంటుంది.
రిలయన్స్ జియో యొక్క కొత్త Rs. 1,699 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలలోకి వెళితే, ఈ ప్లాన్తో రోజువారీ 1.5GB డేటాతో మొత్తంగా 547.5GB డేటా ని అందిస్తుంది. అలాగే, లోకల్, STD మరియు రోమింగ్లకు అపరిమిత కాలింగ్ మరియు రోజువారీ 100SMS పరిమితితో 365 చెల్లుబాటుతో వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
