ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ : రోజువారీ 1.4GB డేటా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 75 రోజుల చెల్లుబాటు
ఈ కొత్ ప్రీపెయిడ్ ప్లాన్ Rs.419 రూపాయల ధరతో వస్తుంది.
ఎయిర్టెల్ తన చందాదారులకు మంచి ప్రయోజనాలతో, ఎయిర్టెల్ కొత్త Rs.419 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ మరియు డైలీ SMS సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. అంతేకానుండా, ఈ మొత్తం ప్రయోజనాలను 75 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది.
Surveyఎయిర్టెల్ కొత్త Rs.419 ప్లాన్ ప్రయోజనాలు
ఈ ప్లాన్తో, రోజువారి 3G /4G తో 1.4GB డేటా మీకు అందుతుంది మరియు ఎటువంటి FUP పరిమితిలేని STD మరియు లోకల్, అపరిమిత కాలింగ్ కూడా చేసుకోవచ్చు దీని లేదు. అలాగే, రోజువారీ 100 SMS పరిమితితో 75 రోజుల చల్లుబాటుతో వస్తుంది. ఈ ఆఫర్ కేవలం ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే.
అయితే, ముందు నుండి అందుబాటులో వున్నా Rs.399 మరియు Rs.448 ప్లాన్లు కూడా 1.4GB రోజువారీ డేటా మరియు ఎటువంటి FUP పరిమితిలేని STD మరియు లోకల్, అపరిమిత కాలింగ్ తో ఇటువంటి ప్రయోజనాలనే ఇస్తాయి. ఈ కొత్తగా వచ్చిన Rs.419 ప్లాన్ 75 రోజుల చెల్లుబాటులో వస్తే Rs.399 ప్లాన్ 70 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు కొంత మంది ఎంపిక చేసిన చందాదారులకు ఇది 84 రోజుల చెల్లుబాటును ఇస్తుంది. అల్లాగే , Rs.448 ప్లాన్ 82 రోజుల చెల్లుబాటుతో అలంటి ప్రయాణాలను అందిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile