My Jio App కొత్త అప్డేట్ తో 5GB క్లౌడ్ స్టోరేజి ఉచితంగా అందుకోండి

HIGHLIGHTS

ఇప్పుడు మై జియో యాప్ ద్వారా JioTune కు కూడా యాక్సెస్ అందుకుంటారు.

My Jio App కొత్త అప్డేట్ తో 5GB క్లౌడ్ స్టోరేజి ఉచితంగా అందుకోండి

టెలికాం సంస్థ రిలయన్స్ జియో,  తన My Jio App ను అప్‌డేట్ చేసింది. ఈ ఆప్ ఇప్పుడు జియో క్లౌడ్ ఇంటిగ్రేషన్‌తో అప్డేట్ చెయ్యబడింది. ఈ క్లౌడ్ యాక్సెస్ ద్వారా, వినియోగదారులు వారి ఫోటోలు, ఫైల్స్, వీడియో కంటెంట్‌ను Live గా మైజియో ఆప్ లో సేవ్ చేయగలరు. ఇది మాత్రమే కాదు, ఈ జియో క్లౌడ్ అప్లికేషన్  Android మరియు iOS పరికరాలలో కూడా అందుబాటులో ఉంది మరియు మీరు దాని వెబ్ వెర్షన్‌ను కూడా మీరు పొందవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ అప్డేట్ తరువాత, వినియోగదారులు ఇప్పుడు మై జియో యాప్ ద్వారా JioTune కు కూడా యాక్సెస్ అందుకుంటారు. ఈ అప్డేట్ తర్వాత, జియో వినియోగదారులు తమ జియో ట్యూన్‌లను సెట్ చేయవచ్చు, వినవచ్చు మరియు తీసివేయవచ్చు. రిలయన్స్ జియో యొక్క ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాల కోసం ఈ అప్డేట్  My Jio App యొక్క  ప్రత్యేక జియో క్లౌడ్ విభాగం అందుబాటులో ఉంటుంది. వినియోగదారుల కోసం, ఈ అప్డేట్ లో 5 GB క్లౌడ్ స్టోరేజిని కూడా అందించింది.

అప్డేట్ డౌన్‌లోడ్

ANDROID వినియోగదారులు Google Play నుండి అప్డేట్ అయినా కొత్త  "మై జియో ఆప్ " యొక్క వెర్షన్ 5.0.27 ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, మీరు iOS వినియోగదారులయితే, మీరు యాప్ స్టోర్ నుండి సరికొత్త వెర్షన్ 5.0.11 ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సివుంటుంది. అటు తరువాత, ఈ నవీకరణ యొక్క ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo