Redmi Note 15: స్లీక్ డిజైన్, భారీ బ్యాటరీ, కొత్త చిప్ సెట్ తో ఎంట్రీ కి సిద్ధం.!
Redmi Note 15 కొత్త చిప్ సెట్ తో ఇండియాలో ఎంట్రీ కి సిద్ధం అయ్యింది
2026 నూతన సంవత్సర ప్రారంభంలోనే ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుంది
ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ కూడా షియోమీ పూర్తిగా వెల్లడించింది
Redmi Note 15 : షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్, భారీ బ్యాటరీ, కొత్త చిప్‌సెట్‌తో ఇండియాలో ఎంట్రీ కి సిద్ధం అయ్యింది. 2026 నూతన సంవత్సర ప్రారంభంలోనే ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ కూడా షియోమీ పూర్తిగా వెల్లడించింది. ఈ అప్ కమింగ్ రెడ్ మీ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పై ఒక లుక్కేద్దామా.
SurveyRedmi Note 15: కంప్లీట్ ఫీచర్స్
స్లీక్ డిజైన్, భారీ బ్యాటరీ, కొత్త చిప్‌సెట్ త్రయ మంత్రంతో ఈ ఫోన్ ను ఐదునియాలో ప్రవేశపెట్టాలని రెడ్ మీ యోచిస్తోంది. ఈ ఫోన్ ఫస్ట్ లుక్ లో మీకు ఈ ఫోన్ డిజైన్ మిమ్మల్ని ఆకట్టుకునే కంప్లీట్ ఆల్ న్యూ డిజైన్ తో ఉంటుంది. ఇది కేవలం 7.35mm తో చాలా స్లీక్ గా ఉంటుంది. అంతేకాదు, ఇది మరింత స్లీక్ గా కనిపించే కర్వుడ్ డిజైన్ తో ఉంటుంది.
ఈ ఫోన్ లో 6.77 ఇంచ్ పరిమాణం కలిగిన బిగ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఆకట్టుకుంటుంది. చేతులు తడిగా ఉన్నా లేదా వర్షంలో స్క్రీన్ పై చినుకులు పడినా కూడా స్క్రీన్ చక్కగా పనిచేసే హైడ్రో టచ్ 2.0 ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ కొత్త చిప్ సెట్ Snapdragon 6 Gen 3 తో పని చేస్తుంది. ఇది Ai సపోర్ట్ తో కూడా ఉంటుంది.

కెమెరా పూర్వకంగా ఈ ఫోన్ లో వెనుక పెద్ద సర్కిల్ బంప్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 108MP OIS మెయిన్ సెన్సార్ ఉంటుంది మరియు ఇది 4K వీడియో రికార్డింగ్ మరియు డైనమిక్ షాట్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ కలిగిన స్లీక్ డిజైన్ లో పెద్ద బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో 5520 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఇది దాదాపు 5 సంవత్సరాల జీవిత కాలం కలిగి ఉంటుందని రెడ్ మీ చెబుతోంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వేగంగా ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ IP66 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా వస్తుంది.
Also Read: 2026 Upcoming Phones: కొత్త ఏడాదిలో ముందుగా లాంచ్ అవుతున్న ఫోన్స్ లిస్ట్.!
Redmi Note 15: లాంచ్ అండ్ సేల్
రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ 2026 జనవరి 6న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు షియోమీ అధికారిక సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile