POCO F7 5G పై డబుల్ ధమాకా ఆఫర్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

POCO F7 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ డబుల్ ధమాకా ఆఫర్స్ అందించింది

ఈ ఫోన్ మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ పవర్ ఫుల్ ఫోన్ గా వచ్చింది

ఈ ప్రైస్ సెగ్మెంట్ లో గొప్ప పోటీ ఫీచర్స్ కలిగిన ఫోన్ గా ఇది నిలుస్తుంది

POCO F7 5G పై డబుల్ ధమాకా ఆఫర్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

POCO F7 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ డబుల్ ధమాకా ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ పవర్ ఫుల్ ఫోన్ గా వచ్చింది మరియు మంచి సేల్స్ కూడా సాధించింది. గేమింగ్ కోసం అవసరమైన అన్ని హంగులో ఈ ఫోన్ లో ఉన్నాయి. కెమెరా పరంగా కొంత వెనుకబడినట్లు చెబుతున్నా, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో గొప్ప పోటీ ఫీచర్స్ కలిగిన ఫోన్ గా ఇది నిలుస్తుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఫోన్ పై డబుల్ ధమాకా ఆఫర్స్ కూడా పొందవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

POCO F7 5G : డబుల్ ధమాకా ఆఫర్స్?

ఇప్పటికే అనేకసార్లు చెప్పారు అసలు ఏమిటి ఈ డబుల్ ధమాకా ఆఫర్స్? అని మీరు అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నా. ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ఈ ఫోన్ పై బ్యాంక్ మరియు భారీ అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ రెండు ఆఫర్లు అందించింది. అందుకే ఈ ఆఫర్ ను డబుల్ ధమాకా ఆఫర్స్ అని చెబుతున్నారు. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ చాలా తక్కువ ధరకు లభిస్తుంది.

POCO F7 5G flipkart sale deal

ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 31,999 ధరలో సేల్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై రూ. 2,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ జత చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను HDFC, ICICI మరియు మరికొన్ని సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అంటే, ఈ రెండు ఆఫర్స్ తో టోటల్ రూ. 4,000 డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ పోకో కొత్త ఫోన్ ను కేవలం రూ. 27,999 రూపాయల అతి తక్కువ ధరలో పొందవచ్చు.

Also Read: Flipkart Year End Sale: కేవలం 15 వేల ధరకే బ్రాండెడ్ 4K QLED Smart Tv అందుకోండి.!

POCO F7 5G : ఫీచర్స్

ప్రొకో ఎఫ్ 7 స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ పవర్ ఫుల్ క్వాల్కమ్ చిప్ సెట్ Snapdragon 8s Gen 4 తో ఉంటుంది. ఇది 2.1 మిలియన్ AnTuTu స్క్రీన్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.83 అంగుళాల AMOLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR10+ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఇది గేమింగ్ కోసం గొప్పగా ఉంటుంది.

ఈ ఫోన్ లో 50MP Sony IMX882 మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ పోకో ఫోన్ 4K వీడియో సపోర్ట్ మరియు గొప్ప Ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7,550mAh బిగ్ బ్యాటరీ తో ఉంటుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 22.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo