Jio Best Plan: వన్ ఇయర్ అన్లిమిటెడ్ సర్వీస్ ఇచ్చే బెస్ట్ ప్లాన్

Jio Best Plan: వన్ ఇయర్ అన్లిమిటెడ్ సర్వీస్ ఇచ్చే బెస్ట్ ప్లాన్
HIGHLIGHTS

జియో కస్టమర్ల కోసం బెస్ట్ ప్లాన్స్

వన్ ఇయర్ అన్లిమిటెడ్ సర్వీస్

కాలింగ్, డేటా మరియు SMS లతో సహా అన్లిమిటెడ్ సర్వీస్

జియో తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ప్రకటిస్తూనే వుంది. అయితే, పూర్తి వన్ ఇయర్ అన్లిమిటెడ్ సర్వీస్ ఇచ్చే బెస్ట్ ప్లాన్ కోసం చూస్తుంటే మాత్రం ఒక బెస్ట్ ప్లాన్ ఉంది. జియోఫోన్ యూజర్ల కోసం అందించిన కొత్త ప్లాన్ కస్టమర్లకు మంచి లాభాలనిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే జియోఫోన్ యూజర్లు ఒక సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ సర్వీసులు పొందవచ్చు.

అయితే, ఇప్పటికే వున్నా జియోఫోన్ కస్టమర్ల కోసం మాత్రం పూర్తిగా ఒక సంవత్సరం అంతా కాలింగ్, డేటా మరియు SMS లతో సహా అన్లిమిటెడ్ సర్వీస్ ను అందించే ప్లాన్ ను అందించింది. అయితే,  మీరు తెల్సుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఇక్కడ వున్నాయి. జియో యొక్క జియోఫోన్ లేటెస్ట్ అన్లిమిటెడ్ 749 రూపాయల ప్లాన్ కొన్ని కండిషన్స్ కలిగి వుంది.

జియోఫోన్ కస్టమర్ల కోసం జియో కొత్తగా 749 రూపాయల అన్లిమిటెడ్  ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ తో రీచార్జి చేస్తే మీకు మొత్తంగా ఒక సంవత్సరం అన్లిమిటెడ్ సర్వీసులు అందుతాయి. అయితే, ఈ ప్రయోజనాలను దశల (సైకిల్స్) వారీగా అందిస్తుంది. ఈ ప్లాన్ తో నెలకు (28 రోజులకు) లకు 2GB చొప్పున 12 సైకిల్స్ (నెలలకు) ఈ 24 జీబీ డేటా ఇస్తుంది.

అలాగే, SMS లు కూడా నెలకు (28 రోజులకు) 50 చొప్పున లిమిట్ సెట్ చేసింది. వ్యాలిడిటీ విషయంలో కూడా 1 సైకిల్ కి 28 రోజుల మొత్తం 12 సైకిల్స్ కి 336 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అయితే, కాలింగ్ మాత్రం ఎటువంటి లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ గా ప్రకటించింది. అధనంగా, జియో యాప్స్ కి యాక్సెస్ వుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo