జియో vs వోడాఫోన్ vs ఎయిర్టెల్
రూ. 200 ధరలో అందుబాటులోవున్న 28 రోజుల వ్యాలిడిటీ బెస్ట్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్.
భారతీ ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ లు సరికొత్త ప్లాన్స్ తీసుకురావడమే కాకుండా, ప్రస్తుతం వాడుకలోవున్న ప్రీపెయిడ్ ప్లాన్లలో కూడా కొంత మార్పులు చేస్తున్నాయి. అయితే, టెలికం మార్కెట్లోకి అద్భుతమైన ఆఫర్లతో రంగప్రవేశం చేసిన జియో, మంచి ఆఫర్లతో తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం అందుబాటులోవున్న, ఎయిర్టెల్, వోడాఫోన్ మరియు రిలయన్స్ జియో టెలికం కంపెనీల యొక్క రూ. 200 ధరలో అందుబాటులోవున్న 28 రోజుల వ్యాలిడిటీ బెస్ట్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు వాటి ప్రయోజనాలను చూద్దాం.
Surveyభారతీ ఎయిర్టెల్ రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
భారతీ ఎయిర్టెల్ యొక్క రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజువారీ 1.4 GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుండగా, ఇప్పుడు ప్రకటించిన 100 MB అధిక డేటాతో కలిపి రోజువారీ 1.5 GB డేటా ప్రయోజనాన్ని ఇప్పుడు తన వినియోగదారులకి అందిస్తోంది. అలాగే, అపరిమిత లోకల్ మరియు STD కాలింగ్ మరియు డైలీ 100SMS లతో కలిపి 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
వోడాఫోన్ రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
వోడాఫోన్ కూడా తన రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజువారీ 1.4 GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుండగా, ఇప్పుడు ప్రకటించిన 100 MB అధిక డేటాతో కలిపి రోజువారీ 1.5 GB డేటా ప్రయోజనాన్ని ఇస్తోంది వినియోగదారులకి. అంతేకాకుండా, అపరిమిత లోకల్ మరియు STD కాలింగ్ మరియు డైలీ 100SMS లతో కలిపి 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
రిలయన్స్ జియో రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
రిలయన్స్ జియో యొక్క రూ. 149 రూపాయల ప్రీపెయిడ్ ప్లానుతో మంచి ప్రయోజనాలను అందిస్తోంది. ఈ 149 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రోజువారీ 1.5 GB డేటా, అపరిమిత లోకల్ మరియు STD కాలింగ్ మరియు డైలీ 100SMS లను అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాను 28 వ్యాలిడిటీతో పొందవచ్చు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile