జియో Vs వోడాఫోన్ : నవంబర్ ఆఫర్లు

HIGHLIGHTS

ఈ రెండు టెలికాం సంస్థలు నవంబరులో ప్రకటించిన బెస్ట్ ఆఫర్లు.

జియో Vs వోడాఫోన్ : నవంబర్ ఆఫర్లు

ఈ నవంబరు నెలలో అన్ని టెలికాం కంపెనీలు కూడా తమ కొత్త ఆఫర్లను తీసుకొచ్చాయి. అయితే, వోడాఫోన్ మరియు జియో మాత్రం ఒకదానిమీద మరొకటి పోటాపోటీగా, తమ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. ఈ దీపావళికి సరికొత్త Rs. 1699 ధరతో వార్షిక ప్రీపెయిడ్ ప్లానుతో జియో వస్తే, వోడాఫోన్ తన Rs 189 రూపాయల ప్రీపెయిడ్ ప్లానుతో మంచి లాభాలను తీసుకొచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vodafone d.jpg

వోడాఫోన్ Rs 189 ప్రీపెయిడ్ ప్లాన్       

Vodafone Rs 189 ప్రీపెయిడ్ ప్లానుతో,  అపరిమిత కాలింగ్ మరియు  2GB డేటా కూడా మీకు అందుతుంది. అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్ కూడా రోజుకు 250 నిమషాలు లేదా వారానికి 1000 నిమిషాల వరకు కాలింగ్ చేసుకునే విధమైన షరతులతో వస్తుంది. వోడాఫోన్ నుండి వచినటువంటి చాల ప్లానులు కూడా ఇటువంటి షరతులతో వచ్చాయి. ఈ ప్రీపెయిడ్ ప్లానుతో మీకు ఎటువంటి SMS ప్రయోజనాలను అందించడంలేదు వోడాఫోన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 58 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కాలింగ్ కోసం ఆధారపడేవారికి ఈ రూ. 189 ప్రీపెయిడ్ ప్లాన్ మంచి లాభాన్నితెచ్చే ప్లానుగా ఉంటుంది.

jio.jpg

జియో Rs 1699 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

ఈ జియో Rs 1699 వార్షిక ప్రీపెయిడ్ ప్లానుతో,  అపరిమిత కాలింగ్,  రోజువారీ 1.5GB డేటా మరియు డైలీ 100SMS లను కూడా మీకు అందిస్తుంది.  ఈ అన్లిమిటెడ్ కాలింగ్ ఏవిధమైన షరతులు విధించకుండా, పూర్తి అపరిమితంగా అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంటే  మొత్తంగా, 547.5 GB ల డేటాని మీరు పొందుతారు. దీనిని 12 నెలలుగా విభజిస్తే, నెలకు కేవలం 142 రూపాయలు మాత్రమే అవుతుంది. అంతేకాకుండా, నవంబర్ 30వ తేదీవరకు 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులోవుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo