Poco M8 5G లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన పోకో.. అంచనా ఫీచర్స్ కూడా తెలుసుకోండి.!
Poco M8 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను ఈరోజు పోకో అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ కొత్త సంవత్సరం లో సరికొత్తగా లాంచ్ అవుతుంది
ఈ ఫోన్ డిజైన్ ను హైలెట్ చేస్తూ “ Designed To Slay” క్యాప్షన్ తో ఈ ఫోన్ టీజింగ్
Poco M8 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను ఈరోజు పోకో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కొత్త సంవత్సరం లో సరికొత్తగా లాంచ్ అవుతుంది. పోకో M సిరీస్ నుంచి ఎన్నడూ చూడని కొత్త డిజైన్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు పోకో చెబుతోంది. అందుకే, ఈ ఫోన్ డిజైన్ ను హైలెట్ చేస్తూ “ Designed To Slay” క్యాప్షన్ తో ఈ ఫోన్ ను టీజింగ్ చేస్తోంది.
SurveyPoco M8 5G : లాంచ్ డేట్?
పోకో M8 5జి స్మార్ట్ ఫోన్ 2026 జనవరి 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుందని, పోకో ఈ ఫోన్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ వివరాలు రివీల్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ తెలియజేసే టీజర్ ఇమేజ్ కూడా రివీల్ చేసింది.
Poco M8 5G : ఫీచర్స్
ముందుగా కంపెనీ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతున్న డిజైన్ విషయాలు చూద్దాం. ఈ ఫోన్ చూడటానికి సన్నగా మరియు కర్వుడ్ ఎడ్జెస్ తో ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లో మనం చూడవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక కెవ్లార్ ఎడ్జెస్ డిజైన్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే డిజైన్ మాత్రమే కావచ్చు అని అనిపిస్తుంది. ఈ ఫోన్ లో వెనుక పెద్ద కెమెరా బంప్ లో ఉన్న కెమెరా సిస్టం ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.35mm స్లీక్ డిజైన్ మరియు 178 గ్రాముల లైట్ వెయిట్ తో ఉంటుంది. ఓవరాల్ గా ఇది స్లీక్ అండ్ కర్వుడ్ డిజైన్ ఫోన్ అవుతుంది.

కెమెరా, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP AI డ్యూయల్ కెమెరా సిస్టం ఉంటుంది. ఈ ఫోన్ పోకో M సిరీస్ లో అతి సన్నని ఫోన్ అవుతుంది మరియు పవర్ ప్యాక్డ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది అని కంపెనీ తెలిపింది. ఆన్లైన్ లో వచ్చిన ఈ ఫోన్ లీక్స్ కూడా ఇదే మాట నిజం చేసేలా ఉన్నాయి. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ఉంటుంది. ఇవన్నీ కూడా కంపెనీ రివీల్ చేసిన ఫీచర్స్.
Also Read: Vijay Sales యాపిల్ డేస్ సేల్ నుంచి iPhone 17 Pro పై భారీ డీల్స్ అనౌన్స్ చేసింది.!
ఇక ఈ ఫోన్ పై ఆన్లైన్ లో లీకైన అంచనా ఫీచర్స్ చూస్తే, ఈ పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ బిగ్ కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Snapdragon 6 Gen 3 తో లాంచ్ కావచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్స్ కంపెనీ త్వరలోనే వెల్లడిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile