జియో గుడ్ న్యూస్: ఈ ప్లాన్స్ పైన 12GB హై స్పీడ్ డేటా ఉచితంగా అందుకోండి.!
రిలయన్స్ జియో తన కస్టమర్లకు గొప్ప శుభవార్త అందించింది
ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన 12GB అదనపు డేటాని ఉచితంగా అందిస్తోంది
రోజువారీ ప్రయోజనాలతో పాటుగా 12GB ఉచిత డేటాని కూడా పొందవచ్చు.
రిలయన్స్ జియో తన కస్టమర్లకు గొప్ప శుభవార్త అందించింది. డేటా అధికంగా కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన 12GB అదనపు డేటాని ఉచితంగా అందిస్తోంది. ఈ రెండు ప్లాన్స్ రీఛార్జ్ పైన కస్టమర్లు రోజువారీ ప్రయోజనాలతో పాటుగా 12GB ఉచిత డేటాని కూడా పొందవచ్చు. జియో అందించిన ఈ కొత్త ప్లాన్స్ మరియు వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.
Surveyరిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన రూ.899 మరియు రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ పైన ఈ ఉచిత డేటా అఫర్ ను జత చేసింది. ఈ రెండు ప్లాన్స్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
Jio Rs.349 Plan
జియో యొక్క లేటెస్ట్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.
Jio Rs.899 Plan
జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.
మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile