Jio Offer with rs 399 plan users can get free canva pro access
Jio Offer: దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించిన రిలయన్స్ జియో ఉచిత ఆఫర్స్ కి పెట్టింది పేరుగా మొదటి నుంచి కొనసాగుతూ వచ్చింది. ఇప్పటికే తన రీఛార్జ్ ఆఫర్స్ తో అనేక ఉచిత లాభాలు అందించిన జియో, ఇప్పుడు మరో కొత్త ఉచిత ఆఫర్ ని కూడా ప్రకటించింది. జియో చాల కాలంగా ఆఫర్ చేస్తున్న రూ. 399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను ఎంచుకునే యూజర్లకు ఈ ఉచిత లాభం అందిస్తుంది. ఇది క్రియేటర్స్ లేదా ఇమేజ్ అండ్ వీడియో ఎడిటింగ్ ని ఎక్కువగా ఇష్టపడే వారికి ఉపయోగపడుతుంది.
రిలయన్స్ జియో చాలా కాలంగా యూజర్ల కోసం అందుబాటులో ఉంచిన రూ. 399 రూపాయల అన్లిమిటెడ్ 5G ప్రీపెయిడ్ ప్లాన్ తో కొత్తగా ఉచిత ప్రయోజనం ఒకటి జత చేసింది. అదేమిటంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ఇమేజ్ అండ్ వీడియో ఎడిటింగ్ రంగంలో గొప్ప పేరున్న Canva యొక్క Pro వెర్షన్ కి ఉచిత యాక్సెస్ ని ఆఫర్ చేసింది.
అంటే, ఎవరైతే రిలయన్స్ జియో యొక్క రూ. 399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తారో, ఆ యూజర్లకు కాన్వా ప్రో యొక్క యాక్సిస్ ని ఉచితంగా అందిస్తుంది. నిజానికి కాన్వా ప్రో యాక్సెస్ కోసం నెలకు రూ. 499 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఈ యాక్సెస్ ని జియో ఈ ప్లాన్ తో ఉచితంగా అందిస్తుంది.
జియో యొక్క ఈ లేటెస్ట్ ఆఫర్ తో కాన్వా ప్రో అందుకోవచ్చు. ఈ కాన్వా ప్రో తో అన్లిమిటెడ్ ఎడిటింగ్ యాక్సెస్ యూజర్లకు లభిస్తుంది. అంటే, ఇమేజ్ మరియు వీడియోలు మీరు ఉచితంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో రెడీ టూ యూజ్ టాంప్లెట్స్, వన్ ట్యాప్ బ్యాగ్రౌండ్ జనరేటర్ మరియు AI జనరేషన్ వంటి అనేక పనులు ఇందులో చూసుకోవచ్చు. ఇది ఎడిటింగ్ చేసే వారికి స్వర్గధామం లాంటిది.
Also Read: లేటెస్ట్ ప్రీమియం లెథర్ 5.2 Dolby Soundbar ఆల్ టైం చవక ధరలో సేల్ అవుతోంది.!
రిలయన్స్ జియో యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ప్లే తో రీఛార్జ్ చేసే వారికి 28 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే, అన్లిమిటెడ్ 5జి డేటా, డైలీ 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS వంటి రెగ్యులర్ ప్రయోజనాలు అందిస్తుంది. ఇవి కాకుండా జియో హాట్ స్టార్ మొబైల్, జియో గేమ్స్ మొబైల్, ఫ్యాన్ కోడ్, జియో టీవీ యాక్సెస్ మరియు జియో ఏఐ క్లౌడ్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తుంది.
అదనంగా, రూ. 35,100 రూపాయల విలువైన 18 నెలల Google Gemini Pro యాక్సెస్ తో పాటు రూ. 4,000 రూపాయల విలువైన 12 నెలల Canva Pro యాక్సెస్ ని కూడా ఉచితంగా అందిస్తుంది. ఇవన్నీ మీరు అందుకోవాలంటే రిలియన్స్ జియో యొక్క రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.