JIO కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు విడుదల : రూ.128 నుండి రూ. 2199 వరకూ అనేక ప్లాన్స్
చాలా సరసమైన ధరలో మూడు ప్రత్యేకమైన ప్లాన్స్ కూడా అందించింది
జియో రేపటి నుండి అమలు చెయ్యనున్న తన కొత్త ధరల వివరాలను విడుదల చేసింది. ఈ కొత్త ప్లాన్స్ అన్ని కూడా రేపటి నుండి అమలులోకి వస్తాయి. ఇక ఈ జియో యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాల్లోకి వెళితే, జియో 1 నెల (28రోజులు) వ్యాలిడిటీ మొదలుకొని 1సంవత్సరం వరకూ వ్యాలిడిటీ గల అనేకమైన ప్లాన్స్ అందించింది. అలాగే, కేవలం కాలింగ్ ప్రధానాంశంగా చేసుకొని చాలా సరసమైన ధరలో మూడు ప్రత్యేకమైన ప్లాన్స్ కూడా అందించింది. ఈ సరసమైన ప్లాన్స్ రూ. 128 నుండి ప్రారంభమవుతుంది.
SurveyJIO NEW PLANS : వ్యాలిడిటీ ప్రకారంగా
1. రూ. 199 (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ
2. రూ. 249 (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ
3. రూ. 349 (AIO ప్లాన్) 3 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ
4. రూ. 399 (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 2000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 56 రోజుల వ్యాలిడిటీ
5. రూ. 444 (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 2000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 56 రోజుల వ్యాలిడిటీ
6. రూ. 555 (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ
7. రూ. 599 (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ
8. రూ. 2199 (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 12,000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 365 రోజుల వ్యాలిడిటీ
గమనిక: ఈ 12,000 ఆఫ్ నెట్ మినిట్స్ ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి అందించింది.
ఇక సరసమైన మరియు చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయానికి వస్తే, ఈ విభాగంలో కూడా 3 ప్లాన్స్ అందించింది. అయితే, ప్లాన్స్ డేటా ఎక్కువగా అవసరం లేని మరియు కాలింగ్ ప్రధానంగా అందించింది. వీటిలో మీకు చాలా తక్కువ డేటా దొరుకుతుంది.
1. రూ. 128 (AIO ప్లాన్) 2GB /28 రోజులకి , 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ
2. రూ. 329 (AIO ప్లాన్) 6GB /84 రోజులకి , 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ
3. రూ. 1299 (AIO ప్లాన్) 24GB /84 రోజులకి , 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 365 రోజుల వ్యాలిడిటీ
ఇక పైన తెలిపిన అన్ని ప్లాన్లకు గాను జియో ప్రైమ్ మెంబర్లకు అధనంగా, జియో యాప్స్ కు యాక్సెస్ లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile