ఈరోజు నుండి మారిన JIO ప్లాన్స్ : అన్ని ప్లాన్స్ గురించి సవివరంగా తెలుసుకోండి

ఈరోజు నుండి మారిన JIO ప్లాన్స్ : అన్ని ప్లాన్స్ గురించి సవివరంగా తెలుసుకోండి
HIGHLIGHTS

మూడు ప్రత్యేకమైన ప్లాన్స్ కూడా అందించింది.

ఈరోజు నుండి కొత్త టారిఫ్ లను జియో లిస్టింగ్ చేసింది.  తన కొత్త ప్రీపెయిడ్ ధరలను,  వినియోగదారులకు తగిన ప్రయోజనాలతో ఆల్-ఇన్-వన్ (AIO) ప్రీపెయిడ్ ప్లాన్స్ గా విడుదల చేసినట్లు పేర్కొంది. అంతేకాదు, ప్రస్తుత టెలికం ప్రీపెయిడ్ ప్లాన్లతో పోలిస్తే, ఇవి కొంచెం తక్కువ ధరకే ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్స్ అన్ని కూడా ఈరోజు నుండి అమలులోకి వచ్చాయి. 

ఈ జియో యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను 1 నెల (28రోజులు) వ్యాలిడిటీ మొదలుకొని 1సంవత్సరం వరకూ వ్యాలిడిటీ గల అనేకమైన వ్యాలిడిటీ లతో  అందించింది. అలాగే, కేవలం కాలింగ్ ప్రధానాంశంగా చేసుకొని చాలా సరసమైన ధరలో మూడు ప్రత్యేకమైన ప్లాన్స్ కూడా అందించింది. ఈ సరసమైన ప్లాన్స్ రూ. 128 నుండి ప్రారంభమవుతుంది.

28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్

ఈ విభాగంలో మూడు ఆల్-ఇన్-వన్ ప్లాన్స్ అందించింది. ఈ మూడు ప్లాన్స్ యొక్క వ్యాలిడిటీ, జియో నుండి జియో నెట్వర్క్ కి అన్లిమిటెడ్ మరియు 1000 నిముషాల ఇతర నెట్వర్క్ కాలింగ్ నిముషాలు వాటి ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఈ మూడు ప్లాన్ల యొక్క రోజు వారి డేటా పరిధి మాత్రమే మారుతుంది.       

1. రూ. 199  (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ           

2. రూ. 249  (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ           

3. రూ. 349  (AIO ప్లాన్) 3 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ           

56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్

ఈ విభాగంలో రెండు ఆల్-ఇన్-వన్ ప్లాన్స్ అందించింది. ఈ రెండు ప్లాన్స్ యొక్క వ్యాలిడిటీ, జియో నుండి జియో నెట్వర్క్ కి అన్లిమిటెడ్ మరియు 2000 నిముషాల ఇతర నెట్వర్క్ కాలింగ్ నిముషాలు వాటి ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఈ రెండు ప్లాన్ల యొక్క రోజు వారి డేటా పరిధి మాత్రమే మారుతుంది.       

1. రూ. 399  (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 2000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 56 రోజుల వ్యాలిడిటీ           

2. రూ. 444  (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 2000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 56 రోజుల వ్యాలిడిటీ           

84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్

ఈ విభాగంలో రెండు ఆల్-ఇన్-వన్ ప్లాన్స్ అందించింది. ఈ రెండు ప్లాన్స్ యొక్క వ్యాలిడిటీ, జియో నుండి జియో నెట్వర్క్ కి అన్లిమిటెడ్ మరియు 3000 నిముషాల ఇతర నెట్వర్క్ కాలింగ్ నిముషాలు వాటి ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఈ మూడు ప్లాన్ల యొక్క రోజు వారి డేటా పరిధి మాత్రమే మారుతుంది.       

1. రూ. 555  (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ           

2. రూ. 599  (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ           

ఒక సంవత్సరం దీర్ఘకాలిక ప్లాన్ (365 రోజులు)

1. రూ. 2199 (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 12,000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 365 రోజుల వ్యాలిడిటీ           

ఇక సరసమైన మరియు చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయానికి వస్తే, ఈ విభాగంలో కూడా 3 ప్లాన్స్ అందించింది. అయితే, ప్లాన్స్ డేటా ఎక్కువగా అవసరం లేని మరియు కాలింగ్ ప్రధానంగా అందించింది. వీటిలో మీకు చాలా తక్కువ డేటా దొరుకుతుంది.

1. రూ. 128 (AIO ప్లాన్) 2GB /28 రోజులకి , 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ           

2. రూ. 329 (AIO ప్లాన్) 6GB /84 రోజులకి , 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ           

3. రూ. 1299 (AIO ప్లాన్) 24GB /84 రోజులకి , 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, 365 రోజుల వ్యాలిడిటీ

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo