Jio Network issue: మీ ప్రాంతంలో జియో నెట్ వర్క్ పని చేయడం లేదా.!
Jio Network issue భారీగా రిపోర్ట్ చేస్తున్న యూజర్లు
నెట్ వర్క్ తో యూజర్ అసహనానికి గురి చేస్తున్నట్లు రిపోర్ట్స్
జియో ఇప్పుడు నెట్ వర్క్ ఇష్యు గురించి రిపోర్ట్స్ అందుకుంది
Jio Network issue: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీగా వెలుగొందుతున్న రిలయన్స్ జియో ఇప్పుడు రెగ్యులర్ గా నెట్ వర్క్ తో యూజర్ ఐ అసహనానికి గురి చేస్తున్నట్లు రిపోర్ట్స్ అందుకుంటోంది. గత నెలలో దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో రెండు రోజులు నెట్ వర్క్ ఇష్యు గురించి రిపోర్ట్స్ అందుకున్న జియో, ఇప్పుడు నిన్న రాత్రి నుంచి నెట్ వర్క్ ఇష్యు గురించి రిపోర్ట్స్ అందుకుంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి జియో యూజర్లు జియో నెట్ వర్క్ ఇష్యు గురించి Downdetector నుంచి రిపోర్ట్స్ చేస్తున్నారు. అంతేకాదు, జియో నెట్ వర్క్ డౌన్ సమస్య గురించి అనేక మంది యూజర్లు X ప్లాట్ ఫామ్ లో వినూత్నమైన ట్వీట్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
SurveyJio Network issue:
ప్రముఖ ఔటేజ్ రిపోర్ట్ ప్లాట్ ఫామ్ డౌన్ డిక్టేటర్ సాక్షిగా నిన్న సాయంత్రం 8 గంటల నుంచి తమ ప్రాంతంలో రిలయన్స్ జియో నెట్ వర్క్ పని చేయడం లేదని అనేక మంది యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో ఈ సమస్య తారాస్థాయికి చేరుకున్నట్లు డౌన్ డిక్టేటర్ అందుకున్న రిపోర్ట్ సంఖ్య వెల్లడిస్తుంది.
జియో యూజర్లు చూసిన సమస్య ఏమిటి?
రిలయన్స్ జియో యూజర్లకు ఎదురైనా ముఖ్యమైన సమస్య జియో నెట్ వర్క్ పూర్తి కనుమరుగవడం. డౌన్ డిక్టేటర్ లో యూజర్లు అందించిన రిపోర్ట్ లలో 81 శాతం మంది యూజర్లు ఈ నెట్ వర్క్ సమస్య గురించే రిపోర్ట్ చేశారు. ఈ నెట్ వర్క్ ఇష్యు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి దక్షిణ మెట్రో సిటీలు మొదలు కొని దేశ రాజధాని ఢిల్లీ తో సహా చాలా నగరాల్లో జియో నెట్ వర్క్ ఇష్యు చవి చూస్తున్నట్లు జియో యూజర్లు రిపోర్ట్ ద్వారా అర్ధం అవుతుంది.

ఇక జియో యూజర్లు చూసిన రెండవ సమస్య మొబైల్ ఇంటర్నెట్. 13 శాతం యూజర్లు జియో మొబైల్ ఇంటర్నెట్ ఇష్యు చూసినట్లు రిపోర్ట్ చేశారు. చివరిగా, 6 శాతం మంది యూజర్లు మొబైల్ ఫోన్ ఇష్యు గురించి రిపోర్ట్ చేశారు. అయితే, ప్రస్తుతం ఈ సమస్య తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.
Also Read: Vivo X Fold 5: లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన వివో.!
అయితే, నిన్న రాత్రి నుంచి X ప్లాట్ ఫామ్స్ నుంచి చాలా మంది జియో యూజర్లు జిఓ నెట్ వర్క్ ఇష్యు గురించి వినూత్నమైన పోస్ట్ లతో ట్వీట్స్ చేస్తున్నారు. మచ్చుకు కొన్ని ట్వీట్స్ ఇక్కడ చూడవచ్చు.