JIO ప్లాన్ల ధరలకు రెక్కలు : ఏకంగా 40 శాతం వరకూ పెరిగే అవకాశం.

JIO ప్లాన్ల ధరలకు రెక్కలు : ఏకంగా 40 శాతం వరకూ పెరిగే అవకాశం.
HIGHLIGHTS

ఇక రీఛార్జ్ ఎక్కువ డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం, టెలికాం పరిశ్రమ మరొక పెద్ద మార్పుకు నాంది పలకడానికి సిద్ధంగా ఉంది, ఈ రోజు దీని గురించిన కొత్త సూచనలు కూడా కనిపిస్తోంది. అయితే, ఈ మార్పు వినియోగదారులకు ఉపయోగపడేదిలా కాకుండా, పెద్ద గుదిబండలా ఉండనుంది. ఇక విహాసినికి వస్తే, టెలికం ఆపరేటర్లందరూ తమ ప్లాన్ల ధరలను పెంచడంతో టెలికాం ప్రపంచంలో పెద్ద మార్పు జరిగింది. ఉహించినట్లుగా, ఈ దిశగా వోడాఫోన్ ఐడియా మొదటగా నిర్ణయాన్ని తీసుకుంది, ఈ దశలో ఈ ఎయిర్టెల్ ఈ సంస్థకు మద్దతు ఇచ్చిన తరువాత సంస్థగా ఉండగా, రిలయన్స్ జియో నుండి కూడా ఇలాంటి ప్రకటన వచ్చింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు, దీనిలో టారిఫ్ పెంపు గురించి కొన్ని వివరాలను పునరుద్ఘాటించారు, ఇది రాబోయే రోజుల్లో మన ముందకు రాబోతోందని స్పష్టం చేశారు.

ముందుగా, ఈ డిసెంబరులో ఇది జరగబోతోందని ప్రకటించగా, డిసెంబర్ ప్రారంభమైన వెంటనే ఈ స్టెప్ జరిగింది. ఇప్పుడు, ఈ సమయంలో, రిలయన్స్ జియో తన వినియోగదారులకు టారిఫ్ పెంపు ధరల గురించి తెలియజేసింది. అయితే, ఈ ప్రణాళికల విలువ పెరిగిన తరువాత వినియోగదారులు ఎటువంటి ప్రయోజనాలను  పొందుతారు చూడాలి. అంటే, రిలయన్స్ జియో ఈ ప్రణాళికల గురించి ఒక నిర్దిష్టమైన ప్రకటన చేయలేదని ఇక్కడ గమనించాలి.

ఇక్కడ గమనించవలసిన మొదటి విషయం ఏమిటంటే, రిలయన్స్ జియో పూర్తిగా కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ లేదా AIO ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది, ఇది 40% టారిఫ్ పెంపుతో వస్తుంది. డేటా, ఎస్ఎంఎస్, రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో అపరిమిత కాలింగ్ మరియు కొన్ని IUC నిమిషాల వంటి, అన్నిప్రయోజనాలతో కూడిన రిలయన్స్ జియో యొక్క ఆల్ ఇన్ వన్ ప్లాన్లను, తాజా ఆఫర్లుగా జాబితా చేయనుంది అని అర్థంచేసుకోవచ్చు. ఈ ప్లాన్లతో, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అయితే, ఈ కొత్త ప్రకటన అంటే రిలయన్స్ జియో రూపొందించిన ఈ AIO ప్లాన్ల ధరలు మాత్రం 40% పెరుగుతాయి మరియు అందువల్ల వినియోగదారులు రాబోయే రోజుల్లో వాటి కోసం ఎక్కువ డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo