జియో ALL IN ONE ప్లాన్స్ తో రోజుకి 2GB స్పీడ్ డేటా అన్లిమిటెడ్ కాలింగ్

జియో ALL IN ONE ప్లాన్స్ తో రోజుకి 2GB స్పీడ్ డేటా అన్లిమిటెడ్ కాలింగ్
HIGHLIGHTS

ఉచితంగా కాలింగ్ చేసేలా జియో ఒక మూడు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకొచ్చింది.

ఈరోజు, జియో తన పోర్టుఫోలియో లోకి కొన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇతర నెట్వర్కులకు చేసే కాల్స్ కి ఎటువంటి ఇతర రుసుమును చెల్లించే పనిలేకుండా, ఉచితంగా కాలింగ్ చేసుకునేలా ఈ ప్లాన్స్ ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎదుర్కుంటున్నగడ్డుకాలం నుండి వినియోగదారులకు మంచి లాభాలను ఇచ్చేలా మరియు ఇతర నెట్వర్క్ లకు కూడా ఉచితంగా కాలింగ్ చేసేలా జియో ఒక మూడు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకొచ్చింది.

ఈ ముందు ప్రీపెయిడ్ ప్లాన్స్ ను రూ.222, రూ. 333 మరియు రూ. 444 రూపాయల ధరలో వీటిని ప్రవేశపెట్టింది. ఇందులో, రూ.222 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఒక నెల (28 రోజుల) వ్యాలిడిటీతో వస్తుండగా, రూ. 333 రుపాయల ప్రీపెయిడ్ ప్లాన్ రెండు నెల చెల్లిబాటుతో వస్తుంది. ఇక చివరి ప్లాన్ అయినటువంటి రూ.444 ప్రీపెయిడ్ ప్లాన్ 3 నెలల వ్యాలిడిటీతో వస్తుంది.

Jio all in one plans intext.png

ఈ మూడు ప్లాన్స్ తో వచ్చే ప్రయోజనాలు

ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క వ్యాలిడిటీ పరిమితి వ్యవధులు వేరువేరుగా ఉన్నా కూడా ఇవి అన్ని అందించే లాభాలు మాత్రం ఒక్కేవిధంగా ఉంటాయి. ఈ ప్లాన్స్ తో రోజువారీ 2GB హై స్పీడ్ 4G అందుతుంది అంటే 28 రోజులకుగాను 56GB డేటా అందుతుంది. అలాగే, లోకల్ మరియు నేషనల్ కాలింగ్ కోసం జియో నుండి జియో కోసం ఉచితంగా అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. అయితే, నాన్ జియో నెట్వర్కు లకు కాలింగ్ కోసం 1000 నిముషాలు మాత్రమే అందించింది. ఇది పైన తెలిపిన మూడు ప్లాన్లకు కూడా వర్తిస్తుంది.

 డైలీ 2GB డేటా కోసం ముందునుండే వున్నా 198 రుపాయల ప్లాన్ తో పాటుగా 1000 నిముషాల నం జియో కాలింగ్ కోసం 100 రుపాయల్ రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. అయితే, ఈ 222 రూపాయల ప్యాక్ తో డైలీ 2GB డాటాతో పాటుగా 1000 నిముషాల నాన్ జిఓ నెట్వర్క్ కాలింగ్ టాక్ టైం పొందవచ్చని జియో చెబుతోంది.                                           

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo