Jio Happy New Year Offer: 29 రోజుల అధిక వ్యాలిడిటీ మరియు మరిన్ని లాభాలను అందుకోండి

Updated on 27-Dec-2021
HIGHLIGHTS

జియో తన వినియోగదారుల కోసం Jio Happy New Year Offer ను ప్రకటించింది

ఈ ఆఫర్ ద్వారా 29 రోజుల అధిక వ్యాలిడిటీ జతచేసింది

ఈ అఫర్ కేవలం 2022 జనవరి 2వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది

2022 రానున్న కొత్త సంవత్సర సెలబ్రేషన్స్ లో భాగంగా జియో తన వినియోగదారుల కోసం Jio Happy New Year Offer ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా 29 రోజుల అధిక వ్యాలిడిటీ మరియు మరిన్ని లాభాలను కూడా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లో జతచేసింది. అదే, రూ.2545 లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ ముందు నుండే అందుబాటులో ఉన్నా, ఇప్పుడు 29 రోజుల అధిక వ్యాలిడిటీ జత చేసిన తరువాత మరింత లాభదాయకంగా ఉంటుంది. అయితే, ఈ అఫర్ కేవలం 2022 జనవరి 2వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Jio Happy New Year Offer:

ఈ ప్లాన్ రూ.2,545 రూపాయలకు వస్తుంది మరియు అఫర్ లో భాగంగా పూర్తి 365 రోజుల వ్యాలిటీని తీసుకువస్తుంది. వాస్తవానికి, ఈ ప్లాన్ ముందుగా 336 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అఫర్ చేసేది. అయితే, జియో ప్రకటించిన  న్యూ ఇయర్ అఫర్ ద్వారా 29 రోజుల అదనపు వ్యాలిడిటీని కలుపుకొని ఇది మొత్తం పూర్తి సంవత్సరం వస్తుంది.

ఇక ఈ వ్యాలిడిటీ కాలానికి (336 రోజులు) గాను డైలీ 1.5 GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా ఆఫర్ అఫర్ చేస్తుంది. అంతేకాదు, డైలీ 100 SMS లిమిట్ తో పూర్తి 336 రోజులకు అందిస్తుంది మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ ను కూడా తీసుకువస్తుంది.

ఇక డైలీ అధిక హై స్పీడ్ డేటా మరియు  వన్ ఇయర్ వ్యాలిడిటీ కోరుకునే వారికి కూడా జియో బెస్ట్ ప్లాన్ అందించింది. అదే, Jio Rs.4,199 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ ప్రయోజాలను ఈ క్రింద చూడవచ్చు.  

Jio Rs.4,199 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3GB డేటాతో మొత్తం 1095 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం ఇక్కడ Click చెయ్యండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :