జియో ధమాకా: 12GB ఉచిత డేటా అఫర్ ప్రకటించిన జియో.!

HIGHLIGHTS

జియో మరొక గుడ్ న్యూస్ తన కస్టమర్లకు అందించింది

12GB ఉచిత డేటా వినియోగదారులు అందుకుంటారు

కొత్త బెస్ట్ ప్లాన్స్ పైన 12GB అదనపు డేటాని జియో ఉచితంగా అఫర్ చేస్తోంది

జియో ధమాకా: 12GB ఉచిత డేటా అఫర్ ప్రకటించిన జియో.!

ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ మరియు అధిక లాభాలను పాత ప్లాన్స్ పైన జతచేసే జియో, ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ తన కస్టమర్లకు అందించింది.  రిలయన్స్ జియో రెండు కొత్త బెస్ట్ ప్లాన్స్ పైన 12GB అదనపు డేటాని ఉచితంగా అఫర్ చేస్తోంది. కస్టమర్లకు అందించే  రోజువారీ ప్రయోజనాలతో జతగా 12GB ఉచిత డేటా కూడా ఈరీఛార్జ్ చేసే వినియోగదారులు అందుకుంటారు. మరి ఈ కొత్త అఫర్ మరియు ప్లాన్స్ పైన ఒకలుక్కేద్దామా.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రిలయన్స్ జియో కొత్తగా తీసుకువచ్చిన రూ.899 మరియు రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ పైన ఈ 12GB ఉచిత డేటా అఫర్ ను యాడ్ చేసింది. ఈ రెండు ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలను ఇక్కడ చూడవచ్చు. 

Jio Rs.349 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.  

Jio Rs.899 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo