Jio జబర్దస్త్ అఫర్: సంవత్సరం మొత్తం డైలీ 2.5GB హై స్పీడ్ డేటా మరియు మరిన్ని లాభాలు
రిలయన్స్ జియో కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ ప్రకటించింది
డైలీ అధిక హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్
Rs.2,999 ప్లాన్ కస్టమర్లకు కంప్లీట్ ప్యాకేజ్ గా వస్తుంది
రిలయన్స్ జియో కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ డైలీ అధిక హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా మరిన్ని ప్రయోజాలను అందిస్తుంది. వాస్తవానికి, రీచార్జ్ రేట్లు పెంచిన తరువాత రిలయన్స్ జియో చాలా ప్లాన్ లలో మార్పులు చేసింది మరియు వాటితో పాటుగా కొత్త ప్లాన్ లను కూడా తీసుకువచ్చింది. లేటెస్ట్ ప్రకటించిన ఈ ప్లాన్ కస్టమర్లకు కంప్లీట్ ప్యాకేజ్ గా వస్తుంది.
SurveyJio Rs.2,999 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
జియో అధికారిక వెబ్సైట్ లేదా మైహోమ్ జియో యాప్ నుండి 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కేటగిరిలో ఈ అఫర్ లిస్ట్ చెయ్యబడింది. ఇక మరిన్ని జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ విషయానికి వస్తే, జియో రూ.2,879 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ కాలింగ్, హై స్పీడ్ డేటా మరియు మరిన్ని ప్రయోజాలను అందిస్తుంది.
Jio Rs.2,879 Plan
ఈ ప్లాన్ కూడా కస్టమర్లకు అధికలాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 730GB డేటాని పొందుతారు. అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అధనంగా, జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఇది పూర్తి సంవత్సరం, అంటే 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile