Jio: భారీ అఫర్ ప్రకటించిన రిలయన్స్ జియో

Jio: భారీ అఫర్ ప్రకటించిన రిలయన్స్ జియో
HIGHLIGHTS

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం భారీ అఫర్ ప్రకటించింది

1 ఇయర్ ఫ్రీ డిస్నీ+ హాట్ స్టార్ 4K కంటెంట్

జియో కస్టమర్లకు ఈ ప్లాన్ తో అధిక లాభాలు అందుతాయి

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం భారీ అఫర్ ప్రకటించింది. జియో తన కస్టమర్లకు అధిక లాభాలను అందించే రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకువచ్చింది. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తాయి. అంటే, ఈ రెండు జియో ప్లాన్స్ రీఛార్జ్ చేసే కస్టమర్లు 4K కంటెంట్ కి యాక్సెస్ అందించే డిస్ని+ హాట్ స్టార్ట్ సేవలను 1 సంవత్సరం మొత్తం ఉచితంగా పొందవచ్చు. జియో అందించిన ఆ రెండు భారీ ఆఫర్లను గురించి తెలుసుకుందామా.             

జియో ఇటీవల తీసుకొచ్చిన రూ.1,499 మరియు రూ.4,199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ రెండు ప్లాన్స్ కూడా రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తాయి. అంతేకాదు, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ అధిక డేటా మరియు మరిన్ని లాభాలను కూడా తీసుకువస్తాయి.

Jio Rs.1,499 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 168GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అలాగే,రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందుతుంది.

Jio Rs.4,199 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 1095GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అదనంగా, ఈ రీఛార్జ్ ద్వారా 200 రూపాయల జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ ను మరియు రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం కూడా కస్టమర్లు పొందుతారు.

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo