Jio పటాకా అఫర్: రోజుకు 8 రూపాయలకే 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందుకోండి.!

HIGHLIGHTS

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త అఫర్ ప్రకటించింది

ఈ అఫర్ పరిధిలో ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్

రోజుకు కేవలం 8 రూపాయల కంటే తక్కువ ఖర్చే అవుతుంది

Jio పటాకా అఫర్: రోజుకు 8 రూపాయలకే 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందుకోండి.!

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త అఫర్ ప్రకటించింది. ఈ అఫర్ పరిధిలో ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను లాంచ్ చెయ్యగా, మరొక ప్లాన్ లో మరిన్ని లాభాలను జత చేసింది. మనం మాట్లాడుకుంటోంది జియో ఇటీవల ప్రకటించిన 'Jio Happy New Year 2023' అఫర్ గురించి. ఈ అఫర్ నుండి లాంచ్ చేసిన కొత్త ప్లాన్ రూ.2023 ధరతో వస్తుంది మరియు ఇది 252 రోజుల లాంగ్ వ్యాలిడిటీ మరియు డేటాతో పాటుగా మరిన్ని లాభాలను అందిస్తుంది. మరి, జియో అందించిన ఈ Jio పటాకా అఫర్ ప్రయోజాలను తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio Happy New year 2023:

రిలయన్స్ జియో కొత్త హ్యాపీ న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా కొత్త రూ.2023 రూపాయల ప్లాన్ ప్రకటించింది. అంతేకాదు, ఈ హ్యాపీ న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా ముందు నుండి కొనసాగుతున్న రూ.2,999 రూపాయల వన్ ఇయర్ ప్లాన్ లో మరిన్ని లాభాలను కూడా జతచేసింది. ఈ ప్లాన్ రూ.2023 రూపాయల మరియు రూ.2,999 అఫర్ చేస్తున్న లాభాలను ఇక్కడ చూడవచ్చు. 

జియో కొత్త రూ.2,023  ప్రీపెయిడ్ ప్లాన్

జియో కొత్త రూ.2,023  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 252 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 630 GB డేటాని డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ అమౌంట్ ను వ్యాలిడిటీ కాలంతో రోజుల చొప్పున లెక్కిస్తే మీకు రోజుకు కేవలం 8 రూపాయల ఖర్చే అవుతుంది.  

జియో కొత్త రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ ముందు నుండే 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా 23 రోజుల అదనపు వ్యాలిడిటీని కూడా జత చేసింది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని మరియు 75 అధనపు డేటాని కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. 

అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ అమౌంట్ ను వ్యాలిడిటీ కాలంతో రోజుల చొప్పున లెక్కిస్తే మీకు రోజుకు కేవలం 8 రూపాయల కంటే తక్కువ ఖర్చే అవుతుంది.

అంతేకాదు, అర్హత కలిగిన వినియోగదారులకు అన్లిమిటెడ్ 5G డేటాని కూడా ఈ ప్లాన్ లతో అందించనున్నట్లు కూడా తెలిపింది.  

మరిన్ని జియో బెస్ట్ ఆఫర్ల కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo