జియో అఫర్: డైలీ అధిక డేటా మరియు OTT సబ్ స్క్రిప్షన్ అఫర్ చేసే బెస్ట్ ప్లాన్.!
జియో యొక్క చవక లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్
ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది
OTT సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది
మీకు డైలీ అధిక డేటా అవసరమవుతుందా? అయితే, మీరు అధిక డేటా మరియు ఇతర ఉచిత సర్వీసులను అఫర్ చేసే జియో యొక్క చవక లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ఎంచుకోవడం మంచిది. వీటిలో ముఖ్యంగా 2,999 రూపాయల ప్రీ పైడ్ ప్లాన్ మీకు చాలా చక్కగా సరిపోతుంది. ఎందుకంటే, ఈ జియో యొక్క ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ రోజూ 2.5GB హై స్పీడ్ డేటాని 365 రోజులు అందిస్తుంది. ఇది మాత్రమే కాదు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా మరిన్ని ఇతర లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ గా పేరొందింది. మరి Jio Rs.2,999 Plan అఫర్ చేసే అన్ని లాభాలను గురించి తెలుసుకోండి.
SurveyJio Rs.2,999 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఈ ప్లాన్ తో 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ సంవత్సరం సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది. 75 GB అడిషనల్ డేటా ను కూడా జియో జత చేసింది.
ఇక మరిన్ని జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ విషయానికి వస్తే, Rs.1,499 రూపాయల విలువవైన డిస్నీ+ హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అఫర్ చేసే లేటెస్ట్ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ గురించి చూడవచ్చు. అదే, రూ.4,199 రూపాయల జియో అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను గురించి ఈ క్రింద చూడవచ్చు.
Jio Rs.4,199 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 1095GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అదనంగా, రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం కూడా కస్టమర్లు పొందుతారు.
మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile