జియో సునామి అఫర్: కేవలం రూ.1 రూపాయకే ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది
రిలయన్స్ జియో 1 రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ ను చాలా సైలెంట్ గా లాంచ్ చేసింది
30 రోజుల వ్యాలిడిటీ మరియు 100MB డేటా
ఈ ప్లాన్ మీకు వెబ్సైట్ నుండి లభించడం లేదు
రిలయన్స్ జియో ఎన్నడూ లేని విధంగా 1 రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ ను చాలా సైలెంట్ గా లాంచ్ చేసింది. ఈ ప్లాన్ లాంచ్ సమయంలో 30 రోజుల వ్యాలిడిటీ మరియు 100MB డేటాని కూడా అఫర్ చేసింది. అయితే, ఒక్కరోజులోనే ఆ ప్లాన్ డేటా మరియు వ్యాలిడిటీ లను తగ్గించింది. అంతేకాదు, ఈ ప్లాన్ మీకు వెబ్సైట్ నుండి లభించడం లేదు. ఈ ప్లాన్ My Jio App నుండి అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ రూ.1 ప్లాన్ కేవలం 1 రోజు వ్యాలిడిటీ మరియు 10MB డేటాను అఫర్ చేస్తోంది.
Surveyఇది మాత్రమే కాదు జియో కేవలం 119 రూపాయలకే డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS లతో సహా అన్ని ప్రయోజాలతో కొత్త ప్లాన్ ను కూడా అందించింది. ఇతర టెలికం కంపెనీల పైన మరింత భారాన్ని పెంచేలా తన రూ.119 రూపాయల అన్లిమిటెడ్ ప్లాన్ లో 300 ఉచిత SMS సౌకర్యాన్ని కూడా జతచేసింది.
జియో రూ.119 ప్లాన్
జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 1.5GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 21 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, 300 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
జియో యొక్క మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile