ఇండిపెండెన్స్ డే సందర్భంగా జియో ధమాకా అఫర్.!
రిలయన్స్ జియో 2022 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ధమాకా అఫర్ ప్రకటించింది
Jio Independence Day 2022 అఫర్
ఈ అఫర్ తో 3,000 రూపాయల వరకు ప్రయోజాలను కస్టమర్లు పొందుతారు
రిలయన్స్ జియో 2022 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ధమాకా అఫర్ ప్రకటించింది. Jio Independence Day 2022 అఫర్ పేరుతో తీసుకొచ్చిన ఈ అఫర్ తో 3,000 రూపాయల వరకు ప్రయోజాలను కస్టమర్లు పొందుతారు. అంతేకాదు, అదనపు డేటా మరియు ఒక సంవత్సరం OTT సభ్యత్వాన్ని కూడా ఉచితంగా అఫర్ చేస్తోంది. 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం జియో తీసుకొచ్చిన ఆ అఫర్ ఏమిటో చూద్దామా.
SurveyJio Independence Day 2022 Offer
జియో ఇండిపెండెన్స్ డే 2022 అఫర్ జియో యొక్క రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ తో అందుబాటులో వుంది. ఈ రెగ్యులర్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు పూర్తిగా ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.
పైన తెలిపిన ప్రయోజనాలన్నీ కూడా ముందు నుండే ఈ ప్లాన్ తో అందుతున్నాయి. అయితే, ఈ ప్లాన్ ను ప్రస్తుతం రీఛార్జ్ చేసే వారికి 75GB అదనపు హై స్పీడ్ 4G డేటా, Ajio పై రూ. 750, Netmeds పై రూ. 750 మరియు Ixigo పై రూ. 750 తగ్గింపుతో సహా రూ. 2,250 విలువైన ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile