Jio Free Offer: మీరు జియో యూజర్ అయితే ఈ 18 నెలల ఉచిత ఆఫర్ మిస్ చేసుకోకండి.!

HIGHLIGHTS

రిలయన్స్ జియో అంటేనే ఉచిత ఆఫర్స్ కి పెట్టింది పేరు

జియో యూజర్ల కోసం మరిన్ని ఉచిత ఆఫర్లను తన రీఛార్జ్ ప్లాన్లకు జత చేసింది

జియో కొత్తగా అందించిన ఈ 18 నెలల ఉచిత ఆఫర్ మిస్ చేసుకోకండి

Jio Free Offer: మీరు జియో యూజర్ అయితే ఈ 18 నెలల ఉచిత ఆఫర్ మిస్ చేసుకోకండి.!

Jio Free Offer: రిలయన్స్ జియో అంటేనే ఉచిత ఆఫర్స్ కి పెట్టింది పేరుగా నిలిచింది. రీసెంట్ గా పెరిగిన టారిఫ్ రేట్లు కారణంగా రిలయన్స్ జియో కొంత అపవాదును మూటగట్టుకుంది. అయితే, రిలయన్స్ జియో యూజర్ల కోసం మరిన్ని ఉచిత ఆఫర్లను తన రీఛార్జ్ ప్లాన్లకు జత చేయడం ద్వారా ఈ అపవాదును తుడిచేసింది. యూజర్ల కోసం 35 వేల రూపాయల విలువైన ఉచిత ఆఫర్స్ ని జియో తన యూజర్ల కోసం చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ తో చేసింది. మీరు కూడా జియో యూజర్ అయితే జియో కొత్తగా అందించిన ఈ 18 నెలల ఉచిత ఆఫర్ మిస్ చేసుకోకండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio Free Offer: ఈ ఆఫర్ ఏమిటి?

రిలయన్స్ జియో యూజర్ల కోసం చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ తో సూపర్ బెనిఫిట్స్ అందించే ఉచిత ఆఫర్ ని జియో అందించింది. అంటే, మీరు ఈ ఉచిత లాభాలు పొందాలంటే జియో ఆఫర్ ఈ ఉచిత లాభాలు జత చేసిన అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేయాలి.

ఈ ఉచిత లాభాలు అందించే ప్లాన్ లు చాలానే అందించింది. సింపుల్ గా చెప్పాలంటే అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్నింటితో ఈ ఉచిత లాభాలు జత చేసింది. స్టార్టింగ్ నుంచి ఉచిత ఆఫర్ అని ఊదరగొడుతున్నారు, ఇంతకీ ఏమిటి ఈ ఉచిత ఆఫర్? అని మీరు అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నా. జియో అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్స్ తో రూ. 35,100 రూపాయల విలువైన గూగుల్ జెమిని AI ప్రో 18 నెలల యాక్సెస్ ను ఉచితంగా జత చేసింది.

అంటే, జియో అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసిన జియో యూజర్లు ఈ ఉచిత లాభాలు అందుకుంటారు. నిజానికి గూగుల్ జెమినీ AI ప్రో యొక్క ఒక నెల సబ్ స్క్రిప్షన్ కోసమే రూ. 1,950 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, జియో ఈ యాక్సెస్ ను ఉచితంగా అందిస్తుంది. అది కూడా ఏకంగా 18 నెలల వరకు ఉచితంగా అందిస్తుంది.

Also Read: Lava Bold N2 Pro: ఆకట్టుకునే ఫీచర్స్ తో బడ్జెట్ సిరీస్ నుండి కొత్త ఫోన్ ప్రకటించిన లావా.!

Jio Free Offer: ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటి?

ఈ ఉచిత ప్రయోజనాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయానికి వస్తే, జియో ఆఫర్ చేస్తున్న అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ. 349 ప్లాన్ మొదలుకొని అంతకంటే పైన లభించే అన్ని 5జి ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఏయే ఉచిత లాభాలు అందిస్తుంది. మొత్తం 14 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఈ ఉచిత లాభాలు అందించే ప్లాన్స్ లిస్ట్ లో ఉన్నాయి. వాటి వివరాలు ఈ క్రింద ఇచ్చిన ఇమేజ్ లో చూడవచ్చు.

Jio Free offer

జియో అందించే గూగుల్ AI ప్రయోజనాలు ఏమిటి?

ఈ ఉచిత యాక్సెస్ తో గూగుల్ జెమినీ ఎఐ ప్రో యాక్సెస్ తో యూజర్లకు లభిస్తుంది. దీని ద్వారా యూజర్లు ప్రీమియం AI బెనిఫిట్స్ పొందుతారు. ఇందులో సూపర్ ఇమేజ్ క్రియేట్ చేసే నానో బనానా 2 యాక్సెస్, సూపర్ AI వీడియో క్రియేటర్ Veo 3.1 యాక్సెస్, డీప్ రీసెర్చ్ యాక్సెస్, సూపర్ సినిమాటిక్ ఫిల్మ్ మేకింగ్ టూల్ Flow వంటి వాటికి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ప్రధానంగా జిమెయిల్ మరియు గూగుల్ డ్రైవ్ తో పాటు గూగుల్ ఫోటోస్ కోసం 2TB గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ యూజర్లకు లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo