ఆగష్టు 15 సందర్భంగా, జియో ఉచిత డేటా ఓచర్లు

ఆగష్టు 15 సందర్భంగా, జియో ఉచిత డేటా ఓచర్లు
HIGHLIGHTS

నిఖీ చేయడానికి మీరు మీ myJioApp లో ఒకసారి చెక్ చేసుకోండి.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రిలయన్స్ జియో ఉచిత డేటా వోచర్లతో తన వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు జియో సంస్థ తన వినియోగదారులకు ఉచిత డేటాను ఇవ్వడం గురించి, కొందరు జియో వినియోగదారులు గుర్తించారు. మా టీం సభ్యుల్లో, జియో కనెక్షన్ ఉన్న  ఇద్దరు అకస్మాత్తుగా ఆగస్టు 15 న ఉచిత డేటా వోచర్‌ను అందుకున్నట్లు మేము చూశాము. ఇది కాకుండా, ఆగస్టు 16 న కూడా ఈ డేటా వోచర్‌ను కూడా అందుకున్నారు. అయితే, జియోతో కనెక్షన్ ఉన్న ఇతర వ్యక్తులు ఈ డేటాను అందుకోకపోవడాన్ని కూడా మేము చూశాము. అయితే, మీరు కూడా ఈ ఉచిత డేటాను అందుకున్నారో లేదో తనిఖీ చేయడానికి మీరు మీ myJioApp లో ఒకసారి చెక్ చేసుకోండి.

మీ ఖాతాకు ఈ ఉచిత డేటా లభించిందో లేదో తెలుసుకోవడానికి, మీరు myJioApp కి వెళ్ళాలి. దీని తరువాత మీరు మై వోచర్‌పై క్లిక్ చేయాలి, ఇది ఆప్ యొక్క UI లో దిగువన కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఉచిత డేటా వోచర్‌ను చూడవచ్చు, అయితే మీరు దాన్ని మీరు అందుకుంటే మాత్రమే చూడగలరు. ఈ వోచర్లు అందరికీ కాకుండా కేవలం సెలెక్టడ్ వినియోగదారులకి అందిస్తుంది కావచ్చు. మీరు ఈ వోచరును అందుకుంటే. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ వోచర్‌లను రీడీమ్ చేయడానికి మీరు రీడిమ్ విభాగానికి వెళ్ళాలి.

మీరు ఈ వోచర్‌ను రీడీమ్ చేసిన వెంటనే, మీరు మై ప్లాన్ విభాగానికి వెళ్ళాలి, ఇది మైజియోఆప్‌లోనే అందుబాటులో ఉంటుంది. ఈ క్రొత్త ఉచిత డేటా మీ ప్రస్తుత డేటా ప్యాక్‌కు కూడా యాడ్ చేయబడినటునట్లు మీరు చూడవచ్చు.

జియో,  తన వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన FTTH సేవను వెల్లడించడం ద్వారా అనేక పెద్ద ప్రకటనలు చేసింది. సంస్థ తన జియో ఫైబర్ సేవలను సెప్టెంబర్ 5 నుండి ప్రారంభిస్తుంది. ఇందులో వినియోగదారులకు బేస్ ప్యాకేజీ రూ .700 ధరతో ఉంటుంది, ఇది 100 ఎమ్‌బిపిఎస్ వేగాన్ని అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo