Diwali 2023 పండుగ సందర్భంగా రిలయన్స్ జియో కస్టమర్ల కోసం Jio Diwali Offer ను అనౌన్స్ చేసింది. రిలయన్స్ జియో యూజర్ల కోసం అధిక లాభాలను అందించే దీపావళి పటాకా ఆఫర్ ను తీసుకు వచ్చింది. దీపావళి 2023 కోసం అధిక డేటా, అధిక వ్యాలిడిటీ మరియు మరిన్ని లాభాలను జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ పైన జత చేసింది. రిలయన్స్ జియో అందించినీ దీపావళి ఆఫర్ మరియు దాని ప్రయోజనా లు ఏమిటో చూసేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
What is Jio Diwali Offer?
ఏమిటి ఈ జియో దివాళీ ఆఫర్ అనుకుంటున్నారా? జియో యొక్క బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్ గా చెప్పబడే రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ పైన దీపావళి సందర్భంగా జియో అధిక లాభాలను జత చేసింది. ఈ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ పైన అధిక డేటా, అధిక వ్యాలిడిటీ మరియు అధిక SMS లాభాలను జియో జత చేసింది. ఈ దీపావళి కోసం జియో ఆఫర్ చేస్తున్న ఈ ప్లాన్ ప్రయోజనాలు పైనఒక లుక్కేయండి.
రిలయన్స్ జియో చాలా కాలంగా ఆఫర్ చేస్తున్న బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,999 పూర్తిగా ఒక సంవత్సరం వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం మరియు డైలీ 2.5 GB చొప్పున 912.5 GB ల టోటల్ 4G డేటాతో పాటు 100 SMS/day ప్రయోజనం కూడా అందుతుంది. అలాగే, సెలెక్టెడ్ యూజర్లు 5G Unlimited డేటా ని కూడా 5G నెట్ వర్క్ పైన అందించవచ్చు. అంతేకాదు , JioTV, JioCinema మరియు JioCloud యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా యూజర్లు అందుకుంటారు.
ఈ ప్లాన్ పైన దీపావళి కోసం ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి?
ఇక ఈ ప్లాన్ పైన దీపావళి కోసం ఎటువంటి ప్రయోజనాలను జియో జత చేసింది అనే విషయానికి వస్తే, దీపావళి సందర్భంగా ఈ ప్లాన్ రీఛార్జ్ పైన 23 రోజుల అధిక వ్యాలిడిటీ అందిస్తోంది రిలయన్స్ జియో. ఈ 23 రోజులకు గాను 75 GB ల అధనపు హై స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS ల ప్రయోజనం కూడా అందిస్తోంది.
అంటే ఈ దీపావళి ఆఫర్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు మొత్తంగా 388 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలను అందుకోవచ్చు.