Jio New Plans: సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే టాప్ ప్లాన్స్.!
సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే Jio ప్లాన్స్
ప్రముఖ OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందించే బెస్ట్ ప్లాన్స్
అన్లిమిటెడ్ లాభాలు అందించే Jio టాప్ ప్లాన్స్
Jio New Plans: సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే టాప్ ప్లాన్స్ చాలానే రిలయన్స్ జియో యూజర్ల కోసం అందించింది. అందులో ప్రముఖ OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందించే బెస్ట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు, మరిన్ని కూడా ఈ వన్ ఇయర్ ప్లాన్ లతో రిలయన్స్ అఫర్ చేస్తోంది. అందులో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు అవి అందించే ప్రయోజనాలను ఈరోజు చూద్దాం.
SurveyJio New Plans with more benefits
పూర్తి 365 రోజులు అన్లిమిటెడ్ లాభాలతో పాటుగా ప్రముఖ OTT యాప్స్ ఉచిత సబ్ స్క్రిప్షన్ మరియు మరిన్ని ఇతర లాభాలను అందించే ప్లాన్ లలో బెస్ట్ ప్లాన్స్ గా రూ. 3,178, రూ. 3,227 మరియు రూ. 3,662 చెప్పబడతాయి ఈ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
Jio Rs. 3,178 Plan
జియో యొక్క ఈ బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్ 365 రోజుల పాటు అన్లిమిటె కాలింగ్, 5G అన్లిమిటెడ్ డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, మీరు 4G నెట్ వర్క్ ఏరియాలో ఉంటే మాత్రం డైలీ 2GB డేటా అందుతుంది. ఈ ప్లాన్ తో 1-year Prime Video Mobile Edition సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.

Also Read : Gold: రోజు రోజుకు పడిపోతున్న బంగారం ధర.. New Price update తెలుసుకోండి.!
Jio Rs. 3,227 Plan
జియో యొక్క ఈ ప్లాన్ తో కూడా 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 5G అన్లిమిటెడ్ డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాలను పొందవచ్చు. ఒకవేళ మీరు 4G నెట్ వర్క్ ఏరియాలో ఉంటే రోజుకు 2GB డేటా చొప్పున సంవత్సరం మొత్తం అందుకుంటారు. అలాగే, ఈ ప్లాన్ తో 1 year Disney+Hotstar Mobile షబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందుకోవచ్చు.
Jio Rs. 3,662 Plan
జియో రూ. 3,662 ప్లాన్ కూడా 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 5G అన్లిమిటెడ్ డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజలు మీకు అందుతాయి. 4G నెట్ వర్క్ పైన రోజుకు 2.5GB డేటా చొప్పున సంవత్సరం మొత్తం పొందుతారు. ఈ ప్లాన్ తో రెండు OTT యాప్స్ కి సబ్ స్క్రిప్షన్ అందుతుంది. ఈ ప్లాన్ తో JioTV app ద్వారా Sony LIV మరియు ZEE5 లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా లభిస్తుంది.
పైన తెలిపిన మూడు వన్ ఇయర్ ప్లాన్స్ పైన Jio Cinema, Jio TV మరియు Jio Cloud యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile