Jio Buy 1 Get 1 Free పేరుతో జియో సూపర్ ఆఫర్ .. ఒక నెల రీఛార్జ్ చేస్తే రెండో నెల ఉచితం.!

Highlights

Jio Buy 1 Get 1 Free పేరుతో జియో సూపర్ ఆఫర్ అందించింది

ఒక నెల రీఛార్జి చేస్తే రెండో నెల బెనిఫిట్స్ ను ఉచితంగా అందిస్తుంది

ఈ రీఛార్జ్ తో బై వన్ గెట్ 1 ఆఫర్ వర్తిస్తే అదనంగా మరో 28 రోజుల ప్రయోజనం పొందవచ్చు

Jio Buy 1 Get 1 Free పేరుతో జియో సూపర్ ఆఫర్ అందించింది. భారత టెలికాం చరిత్రలో ఇప్పటికే ఎన్నో ఉచిత ఆఫర్లను అందించిన రిలయన్స్ జియో, ఇప్పుడు పండుగ సందర్భంగా మరో కొత్త ఆఫర్ ని కూడా తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఆఫర్ తో కేవలం ఒక నెల రీఛార్జి చేస్తే రెండో నెల బెనిఫిట్స్ ను ఉచితంగా అందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు మరియు ఈ ఆఫర్ అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ తో కూడా లభించదు. ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే లభిస్తుందని కంపెనీ నియమం చెబుతోందని నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు, ఈ ఆఫర్ కేవలం రెండు బెస్ట్ బడ్జెట్ నెల రోజుల రీఛార్జ్ ప్లాన్స్ పైన మాత్రమే లభిస్తుంది.

Jio Buy 1 Get 1 Free ఎవరికి అందిస్తుంది?

జియో అధికారిక రిపోర్ట్ ప్రకారం, ఇది కేవలం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందించే లిమిటెడ్ పిరియడ్ ఆఫర్. జియో కస్టమర్లకు ఈ ఆఫర్ గురించి SMS ద్వారా సమాచారం అందిస్తోంది. జియో కేర్ అధికారిక X ఖాతా కూడా అక్టోబర్ 15న ఈ ఆఫర్ గురించి స్పందిస్తూ, Buy 1 Get 1 ఆఫర్ కేవలం పరిమిత కాలానికి ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. ఈ కొత్త ఆఫర్ ద్వారా ప్రతి జియో కస్టమర్‌ కు ఉచిత రీఛార్జ్ లభిస్తుందని మీరు భావించకూడదు. అలాగే, అనధికారిక లింకులు లేదా నకిలీ SMS లను నమ్మకుండా కేవలం MyJio యాప్‌ లోనే ఈ ఆఫర్ వివరాలు పరిశీలించడం మంచిది.

అంటే, ఈ ఉచిత ఆఫర్ మీకు అందుబాటులో ఉంటే మీ MyJio యాప్‌ లో మీకు కనిపిస్తుంది. అప్పుడు మాత్రమే ఈ రీఛార్జ్ చేయడానికి మీరు అర్హులు అని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా కాని యెడల ఈ రీఛార్జ్ లాభాలు మీరు అందుకోలేరని అర్థం చేసుకోవాలి. ఈ ఆఫర్‌ లో భాగంగా ముందుగా చెల్లించిన రీఛార్జ్ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఆ ప్లాన్ వ్యాలిడిటీ పూర్తయిన తర్వాత అదనంగా లభించిన ఉచిత ప్లాన్ ప్రయోజనాలను అందుకుంటారు.

Jio Buy 1 Get 1 Free రీఛార్జ్ ప్లాన్ ఏమిటి?

రిలయన్స్ జియో యొక్క బెస్ట్ బడ్జెట్ 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ గా చెల్లుబాటులో ఉన్న రూ.299 జియో రీఛార్జ్ ప్లాన్ మరియు రూ. 349 రూపాయల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ లతో ఈ ఆఫర్ ని అందిస్తుంది.

రూ.299 జియో రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

ఈ ఆఫర్‌ కు సంబంధించిన నివేదికల ప్రకారం రూ.299 ప్లాన్ ఉచిత అఫర్ అర్హత కలిగిన నంబర్లకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌ తో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలు అందుతాయి. ఈ రీఛార్జ్ తో బై వన్ గెట్ 1 ఆఫర్ వర్తిస్తే అదనంగా మరో 28 రోజుల ప్రయోజనం పొందవచ్చు.

రూ. 349 ప్లాన్‌ లో అన్‌లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది

జియో అధికారిక రీఛార్జ్ వెబ్‌ సైట్ ప్రకారం రూ.349 ప్లాన్‌ లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB హైస్పీడ్ డేటా, అర్హత కలిగిన కస్టమర్‌లకు అన్‌లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం లభిస్తుంది. వీటితో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్‌ పై బై వన్ గెట్ 1 ఆఫర్ అందుబాటులో ఉంటే మీకు మరో 28 రోజుల పాటు ఇదే ప్లాన్ ప్రయోజనాలు అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile