ఈ జియో ప్లాన్స్ తో రెండు OTT ప్లాట్ఫామ్స్ కు ఉచిత యాక్సెస్ అందుకోవచ్చు.!
ఈ జియో ప్లాన్స్ తో మూడు ప్రముఖ OTT ప్లాట్ఫామ్స్ కు ఉచిత యాక్సెస్
Jio కొన్ని ప్లాన్స్ తో ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ ను ఇప్పటికీ అఫర్ చేస్తోంది
ఈ ప్లాన్స్ కేవలం రూ.399 రూపాయల నుండి ప్రారంభమవుతాయి
ఈ జియో ప్లాన్స్ తో మూడు ప్రముఖ OTT ప్లాట్ఫామ్స్ కు ఉచిత యాక్సెస్ అందుకోవచ్చు. ఇటివల, జియో చాలా ప్రీపెయిడ్ ప్లాన్ లలో మార్పులు చేసింది మరియు కొన్నింటిని పూర్తిగా నిలిపివేసింది. అయితే, కొన్ని ప్లాన్స్ తో మాత్రం ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ ను ఇప్పటికీ అఫర్ చేస్తోంది. కానీ, Netflix మరియు Prime Video రెండు ప్రముఖ OTT ప్లాట్ఫామ్స్ యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ అఫర్ చేసే ప్లాన్స్ కూడా జియో అందించింది. అయితే, ఇది ప్రీపెయిడ్ పరిధిలో మాత్రం కాదు, కేవలం పోస్ట్ పైడ్ ప్లాన్ లలో మాత్రమే అఫర్ చేస్తోంది. ఈ ప్లాన్స్ కేవలం రూ.399 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. జియో అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్లను ఎంచుకునే వారు ఎటువంటి ఖర్చు లేకుండా నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్ స్టార్ OTT లలో కంటెంట్ ను ఉచిత చూడవచ్చు.
Surveyజియో యొక్క ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కస్టమర్లకు Netflix మరియు Prime Video రెండు యాప్స్ కి ఉచిత యాక్సెస్ అందిస్తాయి. మరి జియో కస్టమర్లకు Netflix, మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఉచిత యాక్సెస్ తో పాటుగా ఈ ప్లాన్స్ అఫర్ చేసే మరిన్ని ప్రయోజనాలు ఏమిటో చూద్దామా.
జియో అఫర్ చేస్తున్న ఈ ప్లాన్స్ పోస్ట్ పైడ్ ప్లాన్స్ మరియు ప్రయోజనాలు ప్రీపెయిడ్ కస్టమర్లకు వర్తించవు.ఈ ప్లాన్ లను కేవలం పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం మాత్రమే అందించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుండి ప్రారంభమవుతాయి మరియు ఇది వీటిలో బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఈ ప్లాన్ అధిక డేటా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాబాలాను అందిస్తుంది.
Jio రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
జియో యొక్క ఈ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒక నెల రెంటల్ ప్లాన్ మరియు ఇది బిల్ వ్యవధికి గాను 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లిమిట్ కూడా వుంది. ఈ ప్లాన్ తో Netflix మరియు Amazon Prime Video లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు. అంతేకాదు, మీరు 200 GB వరకు డేటాని రోల్ అవుట్ కూడా చేసుకోవచ్చు.
ఇదే లాభాలను అఫర్ చేసే మరొక రెండు ప్లాన్స్ ని కూడా అందించింది. ఇవి మీ ఫ్యామిలీ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ మీకు అధనపు SIM కార్డ్ ను కూడా తీసుకువస్తాయి. అందులో ఒకటి రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మరియు మరొకటి రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. వీటిలో రూ.599 ప్లాన్ 1 సిమ్ కార్డ్ తో వస్తుంది. రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాత్రం 2 అదనపు సిమ్ కార్డ్ లను తీసుకువస్తుంది. అయితే, ఇక్కడ అందించిన ప్లాన్ ధరలకు 18% GST ని కూడా కలుపుకోవాల్సి వుంటుంది.
మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile