Jio Best Offer: సంవత్సరం మొత్తం అధిక లాభాలను అందించే కొత్త ప్లాన్ తెచ్చిన జియో.!
యూజర్లకు సంవత్సరం మొత్తం అధిక లాభాలను అందించే కొత్త ప్లాన్
ఎంటర్టైన్మెంట్ ప్లాన్ లకు పెద్ద పీఠ వేస్తున్న రిలయన్స్ జియో
యూజర్లకు పూర్తి సంవత్సరం అధిక లాభాలను అందిస్తుంది
Jio Best Offer: యూజర్లకు సంవత్సరం మొత్తం అధిక లాభాలను అందించే కొత్త ప్లాన్ ను తీసుకు వచ్చింది రిలయన్స్ జియో. కొంత కాలంగా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ లకు పెద్ద పీఠ వేస్తున్న రిలయన్స్ జియో కొత్త ప్లాన్ లను OTT లాభాలతో అందిస్తోంది. అందుకే, 14 OTT యాప్స్ ఉచిత సబ్ స్క్రిప్షన్ తో కొత్త వన్ ఇయర్ ప్లాన్ ను అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్ యూజర్లకు పూర్తి సంవత్సరం అధిక లాభాలను అందిస్తుంది.
SurveyJio Best Offer
రిలయన్స్ జియో లేటెస్ట్ గా ప్రకటించిన రూ. 4,498 రూపాయల JioTV PREMIUM Plan గురించే మనం మాట్లడుకుంటోంది. ఈ ప్లాన్ ను ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ కేటగిరిలో జియో లాంచ్ చేసింది. ఈ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
జియో రూ. 4,498 ప్లాన్
జియో రూ. 4,498 ప్లాన్ పూర్తిగా ఒక సంవత్సరం (365 రోజుల) వ్యాలిడిటీతో వస్తుంది. ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ 365 వీరోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2 GB చొప్పున 365 రోజులకు గాను మొత్తం 730 GB ల 4G డేటాని అందిస్తుంది. అయితే, అర్హత కలిగిన జియో కస్టమర్లకు అన్లిమిటెడ్ 5G డేటాని ఈ ప్లాన్ తో అందిస్తోంది.
Also Read : ధమాకా ఆఫర్: 18 వేలకే బ్రాండెడ్ బిగ్ 4K Smart Tv అందుకోండి.!
ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో కూడా డైలీ 100 SMS ప్రయోజనం అందుతుంది. ఇది కాకుండా 14 OTT ప్లాట్ ఫామ్ లకు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది. ఈ 14 OTT ల లిస్ట్ ను క్రింద చూడవచ్చు.
ఈ ప్లాన్ తో Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, Sony LIV, ZEE5, Lionsgate Play, Discovery+, Docubay, EPIC ON మరియు Hoichoi లను JioTV app ద్వారా అందిస్తుంది.
అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే జియో యూజర్లు పూర్తి సంవత్సరం, అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా మరియు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ వంటి అన్ని లాభాలను పొందుతారు.