Jio Wi-Fiఅఫర్: కేవలం నెలకు రూ.47 రూపాయల EMI తో Wi Fi రౌటర్ పొందండి

Jio Wi-Fiఅఫర్: కేవలం నెలకు రూ.47 రూపాయల EMI తో Wi Fi రౌటర్ పొందండి
HIGHLIGHTS

JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్

చాలా తక్కువ EMI చెల్లింపుతో JioFi Router M2S Black ని మీసొంతం చేసుకోవచ్చు

నెలకు కేవలం రూ. 47 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది

వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆన్లైన్ క్లాసులు చేసే వారి సంఖ్య మరింత పెరిగినందున దీన్ని దృష్టిలో ఉంచుకొని Jio మరొకసారి బంపర్ అఫర్ ప్రకటించింది. ఇంటిలో వేగవంతమైన కనెక్టివిటీ కోసం Wi-Fi పైన ఆధారపడుతున్నారు. అంతేకాదు, Wi-Fi తో ఇంటిల్లిపాదికి వేగవంతమైన కనక్టివిటీ అందుతుంది. అందుకే, అటువంటి అవసరం ఉన్నవారు Jio యొక్క JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్ ని పరిశీలించవచ్చు. ఈ అఫర్ ద్వారా చాలా తక్కువ EMI చెల్లింపుతో JioFi Router M2S Black ని మీసొంతం చేసుకోవచ్చు.  

ఎందుకంటే, జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi ని ప్రతినెలా అతితక్కువ EMI  అఫర్ తో అందిస్తోంది. ఈ అఫర్ తో రూ.999 విలువగల JioFi Router M2S Black ని నెలకు కేవలం రూ. 47 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు. అంటే, అతితక్కువ  EMI తో కొనుగోలు చెయ్యవచ్చు మరియు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. జియో అధికారిక వెబ్సైట్ https://www.jio.com నుండి ఈ అఫర్ పొందవచ్చు. 

ఇక ఇలాంటిడే మరొక JioFi అఫర్ విషయానికి వస్తే, JioFi Router M2 Black కూడా చాలా తక్కువ EMI ధరకే లభిస్తోంది. ఈ Router M2 Black సేల్ ధర రూ.1,999 రూపాయలు ఉండగా  EMI తో కొనేవారికి కేవలం నెలకు రూ.94 రూపాయల తక్కువ EMI ధరకే ఆఫర్ చేస్తోంది. అయితే, వీటిని క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే వీలుంటుంది. వీటిని నేరుగా జియో అధికారిక వెబ్సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo