Jio: ఎంటర్టైన్మెంట్, 18GB ఎక్స్ట్రా డేటాతో పాటు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!
అన్లిమిటెడ్ లాభాలను అందించే Jio బెస్ట్ ప్లాన్
డిస్ని+ హాట్ స్టార్ తో పాటు 14 OTT యాప్స్ కి యాక్సెస్ అందిస్తుంది
18GB ఎక్స్ట్రా డేటాతో పాటు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్
Jio: మార్కెట్ ట్రెండ్ మరియు యూజర్ల అవసరాలకు అనుగుణంగా రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తూ వస్తోంది. ఇందులో ఎంటర్టైన్మెంట్, 18GB ఎక్స్ట్రా డేటాతో పాటు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ కూడా వుంది. ఈ ప్లాన్ తో అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ తో పాటు 14OTT యాప్స్ కి యాక్సెస్ అందిస్తుంది. జియో యూజర్లకు కంప్లీట్ ప్యాకేజీ గా లభించే ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు ఏమిటో చూద్దామా.
SurveyJio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్
ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో రిలయన్స్ జియో అందించిన కొత్త రూ. 1,198 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం చర్చించుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల పాటు కాలింగ్, డేటా మరియు SMS లాభాలతో పాటు ఎంటర్టైన్మెంట్ ఆనందాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
జియో రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందుకుంటారు యూజర్లు. అలాగే, 4G నెట్ వర్క్ పైన ఈ రోజుకు 2GB మరియు 18GB అదనపు డేటాతో కలిపి 84 రోజులకు గాను మొత్తం 186 GB ల డేటా అందిస్తుంది. 5G నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5G డేటా వినియోగ అవకాశం యూజర్లకు లభిస్తుంది. దీనితో పాటు రోజుకు 100 SMS లు కూడా ఈ ప్లాన్ తో అంధిస్తుంది.

పైన తెలిపిన రెగ్యులర్ ప్రయోజనాలతో పాటు ఈ ప్లాన్ తో 14 OTT లకు యాక్సెస్ కూడా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్, డిస్ని+ హాట్ స్టార్, జీ5, సోనీ లైవ్,లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కంచాలంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, దోకుబే, ఎపిక్ ఆన్, ఫ్యాన్ కోడ్ మరియు హోయ్ చోయ్ వంటి యాప్స్ కి యాక్సెస్ అందిస్తుంది.
Also Read: కేవలం 6 వేలకే 150 ఇంచ్ స్క్రీన్ తో ఇంటిని సినిమా థియేటర్ చేసే ప్రొజెక్టర్ కావాలా.!
ఈ యాప్ లను Jio Tv యాప్ ద్వారా యాక్సెస్ పొందవచ్చు. అలాగే, ఈ ప్లాన్ తో జియో టీవీ మరియు జియో క్లౌడ్ లకు కూడా ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile