TRAI ఆదేశాలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ రేట్లు తగ్గించిన Jio మరియు Airtel కంపెనీలు.!

HIGHLIGHTS

TRAI కొత్త ఆదేశాలతో జియో మరియు ఎయిర్టెల్ ప్లాన్స్ రేట్లు తగ్గింపు

టెలికాం కంపెనీలు కొత్త తెచ్చిన వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ రేట్లు తగ్గించాయి

ట్రాయ్ చేసిన ఆదేశాల మేరకు జియో మరియు ఎయిర్టెల్ కొత్త ప్లాన్స్ తీసుకువచ్చాయి

TRAI ఆదేశాలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ రేట్లు తగ్గించిన Jio మరియు Airtel కంపెనీలు.!

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త ఆదేశాలతో రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ రెండు కంపెనీలు కూడా వాటి కొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ రేట్లు తగ్గించాయి. అన్ని టెలికాం కంపెనీలు కూడా తక్కువ ధరలు యూజర్ కు అనువైన వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించాలని ట్రాయ్ చేసిన ఆదేశాల మేరకు జియో మరియు ఎయిర్టెల్ కొత్త ప్లాన్స్ తీసుకువచ్చాయి. అయితే, ఈ ప్లాన్స్ రేట్లు కూడా అధికంగా ఉన్నాయని, వాటి రేట్లు సరిచేయాలని ట్రాయ్ సూచించింది. ట్రాయ్ సూచన మేరకు ఈ రెండు టెలికాం కంపెనీలు కూడా కొత్త తెచ్చిన వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ రేట్లు తగ్గించాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TRAI

జియో మరియు ఎయిర్టెల్ రెండు టెలికాం కంపెనీలు ఇటీవల రెండేసి కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లు యూజర్ల కోసం అందించాయి. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ రేట్లు మరింత తగ్గించాలనే ట్రాయ్ సూచన మేరకు ఈ ప్లాన్స్ రేట్లు తగ్గించాయి.

Jio కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

రిలయన్స్ జియో ముందుగా ఈ రెండు ప్లాన్స్ ని రూ. 1,958 మరియు 458 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ రెండు ప్లాన్స్ రేట్లు ఇప్పుడు సవరించి, రూ. 1,958 ప్లాన్ ను రూ. 1,748 రేటుతో మరియు రూ. 458 ప్లాన్ ను రూ. 448 రేటుకు తగ్గించింది. అయితే, వన్ ఇయర్ ప్లాన్ వ్యాలిడిటీ ని కూడా స్వల్పంగా తగ్గించింది.

TRAI New Orders For Jio

ఇక కొత్త ప్లాన్స్ అందించే ప్రయోనాల విషయానికి వస్తే, ఈ రెండు ప్లాన్స్ మొత్తం వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అలాగే, రూ. 1,748 ప్లాన్ 336 వ్యాలిడిటీ 3600 SMS లను ఆఫర్ చేస్తుంది మరియు రూ. 448 ప్లాన్ 1000 SMS లను 84 రోజుల వ్యాలీటీడీ తో తీసుకువస్తుంది. ఈ ప్లాన్స్ జియో క్లౌడ్, జియో టీవీ మరియు జియో సినిమా యాప్స్ కి ఉచిత యాక్సెస్ అందిస్తాయి.

Also Read: లేటెస్ట్ LG 3.1.3 Soundbar పై అతి భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!

Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

ఎయిర్టెల్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ కొత్త రేట్ల విషయానికి వస్తే, ఎయిర్టెల్ రూ. 1,959 ప్లాన్ ఇప్పుడు రూ. 110 తగ్గింపుతో రూ. 1,849 రూపాయలకు లభిస్తుంది. అలాగే, రూ. 499 రూపాయల ప్లాన్ ఇప్పుడు 30 రూపాయల తగ్గింపుతో రూ. 469 రూపాయలకు లభిస్తుంది. ఈ రెండు ప్లాన్స్ లో రూ. 1,849 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు మరియు రూ. 469 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తాయి.

TRAI New Orders For Airtel

ఎయిర్టెల్ యొక్క ఈ రెండు లేటెస్ట్ ప్లాన్స్ పూర్తి చెల్లుబాటు కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందిస్తాయి. వీటిలో రూ. 1,849 ప్లాన్ 3600 SMS లను మరియు రూ. 469 రూపాయల ప్లాన్ 900 SMS లను ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ రెండు ప్లాన్స్ మూడు నెలల ఉచిత Apollo 24|7 మెంబర్ షిప్ తో పాటు ఉచిత హలో ట్యూన్స్ సౌకర్యాన్ని కూడా రీఛార్జ్ చేసే యూజర్లకు అందిస్తాయి.

మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo