జియో vs ఎయిర్టెల్: నెల రోజుల వ్యాలిడిటీతో వచ్చే బెస్ట్ ప్లాన్స్..!
ఎయిర్టెల్ మరియు రిలయన్స్ కొత్త వన్ మంత్ అన్లిమిటెడ్ ప్లాన్స్
ఒక నెల వ్యాలిడిటీ అన్లిమిటెడ్ విభాగంలో లేటెస్ట్ ప్లాన్స్
రిలయన్స్ జియో vs ఎయిర్టెల్ లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్
అతిపెద్ద టెలికం దిగ్గజాలు ఎయిర్టెల్ మరియు రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం కొత్త వన్ మంత్ అన్లిమిటెడ్ ప్లాన్స్ ను తీసుకువచ్చాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు డైలీ ఉచిత SMS లతో పాటుగా మరిన్ని లాభాలను కస్టమర్లకు అందించేలా తీసుకువచ్చాయి. ఒక నెల వ్యాలిడిటీ అన్లిమిటెడ్ విభాగంలో ఎయిర్టెల్ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకురాగా, జియో మాత్రం 1 ప్లాన్ మాత్రామే తీసుకువచ్చింది. లేటెస్ట్ గా ఈ రెండు టెలికం సంస్థలు ప్రవేశపెట్టిన ఆ వన్ మంత్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు అవి అందించే ప్రయోజనాలు ఏమిటో చూసేద్దామా.
Surveyజియో కొత్తగా తీసుకొచ్చిన రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్ ప్లాన్ పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ, అంటే నెలలో ఎన్ని రోజులు ఉన్నాసరే (28,30, లేదా 31) అన్ని రోజులకు వర్తిస్తుంది. అంటే క్లియర్ గా చెప్పాలంటే, ఈ నెల ఎన్నో తారిఖున రీఛార్జ్ చేస్తారో వచ్చే నెల ఆ తారీఖు వరకు ప్లాన్ చెల్లుబాటు అవుతుంది.
జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి నెల రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
ఇక ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయానికి వస్తే, ఎయిర్టెల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ లో ఒక చిన్న తేడా వుంది. అదేమిటంటే, ఎయిర్టెల్ రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తే, ఎయిర్టెల్ రూ.319 ప్లాన్ మాత్రం నెలలో వుండే రోజులతో సంభంధం లేకుండా పూర్తి నెలరోజుల చెల్లుబాటుతో వస్తుంది. అర్ధమయ్యేలా చెప్పాలంటే, ఈ నెల ఏ తేదికి మీరు రీఛార్జ్ చేస్తారో వచ్చే నెల ఆ తేదీ వరకు చెల్లుబాటు అవుతుంది.
ఎయిర్టెల్ రూ.296 ప్లాన్ ప్రయోజనాలు
ఎయిర్టెల్ రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ 30 వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 25GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అధనంగా, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఉచిత ట్రయల్ ను కూడా పొందవచ్చు. వీటితో పాటుగా ఉచిత హలో ట్యూన్స్, Wynk Music, FASTag పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ వంటి అదనపు లాభాలను కూడా ఈ ప్లాన్ రీఛార్జ్ తో కస్టమర్లు పొందుతారు.
ఎయిర్టెల్ రూ.319 ప్లాన్ ప్రయోజనాలు
ఎయిర్టెల్ రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి నెల రోజుల (30 లేదా 31 రోజులు) వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 2GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అధనంగా, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఉచిత ట్రయల్ ను కూడా పొందవచ్చు. వీటితో పాటుగా ఉచిత హలో ట్యూన్స్, Wynk Music, FASTag పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ వంటి అదనపు లాభాలను కూడా ఈ ప్లాన్ రీఛార్జ్ తో కస్టమర్లు పొందుతారు.
మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ మరియు రీఛార్జ్ కోసం Click Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile