IPL 2020 సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమైంది. క్రికెట్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని, దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం గొప్ప ప్లాన్స్ రూపొందించింది. ఇప్పుడు, jio సంస్థ 598 రూపాయల కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ తో వినియోగదారులకు రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే వినియోగదారులకు డిస్నీ + హాట్ స్టార్ VIP సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
జియో 598 రూపాయల ప్లాన్
జియో యొక్క రూ .596 క్రికెట్ ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాలింగ్, అలాగే జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేయడానికి 2,000 నిమిషాలు అందిస్తుంది. అదనంగా, క్రికెట్ మరియు ఇంటర్నెట్ చూడటానికి, మీకు రోజుకు 2 GB డేటా లభిస్తుంది, ఇది మొత్తం 112 GB డేటా మరియు నెలకు 100 SMS లను అందిస్తుంది. వినియోగదారులు డిస్నీ + హాట్‌స్టార్ యొక్క VIP ఒక సంవత్సరం ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందుకుంటారు. వినియోగదారులకు జియో యాప్స్ కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
క్రికెట్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని జియో మార్కెట్లో 5 కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ లతో క్రికెట్ అభిమానులు పూర్తి IPL సీజన్ ను ఉచితంగా చూడగలుగుతారు. ఇందులో, రూ. 401, రూ. 499, రూ. 598, రూ. 777 మరియు రూ. 2599 ప్లాన్స్ ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile