Idea యొక్క కొత్త 159 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్, అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా మరియు SMS ప్రయోజనాలతో

HIGHLIGHTS

ఈ కొత్త ప్రణాళిక యొక్క ప్రయోజనాలని, ఐడియా యొక్క వినియోగదారులకి 28 రోజల చెల్లుబాటుతో అందించనుంది.

Idea యొక్క కొత్త 159 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్, అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా మరియు SMS ప్రయోజనాలతో

Idea తన కొత్త 159 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా, అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా మరియు SMS ప్రయోజనాలతో పాటుగా దీనిని 28 రోజుల చెల్లుబాటుతో అందించనుంది. jio వచ్చిన తరువాత టెలికామ్ రంగంలో ఏర్పడిన, గట్టి పోటీకారణంగా టెలికామ్ సంస్థలు వాటి ప్లాన్లలో మార్పులు చేయడం పరిపాటిగా మారింది. అయితే ముందు నుండే అందుబాటులోవున్న,  jio యొక్క Rs 149 ప్లాన్, భారతి ఎయిర్టెల్ యొక్క Rs 159 ప్రీపెయిడ్ ప్లాన్లకి పోటీగా తెస్తున్నఈ ఐడియా యొక్క ప్రయోజనాలని పరిశీలిద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఐడియా Rs 159 అఫర్ ప్రయోజనాలు

ఈ Rs 159 ప్లాన్ ద్వారా వినియోగదారులు, లోకల్, STD మరియు రోమింగ్ తో అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు, అలాగే రోజువారీ 1GB డేటాని కూడా పొందవచ్చు మరియు డైలీ 100SMS లను కూడా అందుకుంటారు. ఈ మొత్తం ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు పరిమితితో అందిస్తోంది ఐడియా. అయితే, ఇదే Rs 159 ధర ప్రణాళికతో వోడాఫోన్ కూడా, అపరిమిత కాలింగ్, రోజువారీ 1GB డేటా మరియు 100SMS లాంటి,  ప్రయోజనాల్ని అందిస్తుంది. కానీ, రోజువారీ 250 నిముషాల పరిధిలో ఈ అపరిమిత కాలింగ్ ఇస్తోంది కాబట్టి, ఐడియా ప్లాన్ దీని కంటే ఉత్తమంగా ఉండవచ్చు.

ఇక jio మరియు భారతి ఎయిర్టెల్ విషయానికి వస్తే, ఎయిర్టెల్ Rs 159 ప్లాన్ తో,  అపరిమిత కాలింగ్, రోజువారీ 1GB డేటా మరియు 100SMS లాంటి,  ప్రయోజనాల్ని అందిస్తుంది.  కానీ, ఈ మొత్తం ప్రయోజనాలని కేవలం 21 రోజుల చెల్లుబాటుతో మాత్రమే అందిస్తోంది, కాబట్టి ఇక్కడ కూడా ఐడియానే ఉత్తమంగా ఉండవచ్చు.  జియో యొక్క Rs 149 ప్రీపెయిడ్ ప్లాన్ తో, లోకల్, STD మరియు రోమింగ్ తో అపరిమిత కాలింగ్, రోజువారీ 1.4GB డేటా మరియు 100SMS లాంటి,  ప్రయోజనాలని 28 రోజుల చెల్లు బాటుతో అందిస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo