BSNL Best Plans: చవక ధరలో వచ్చే లాంగ్ వ్యాలిడిటీ అందించే ప్లాన్స్.!
చవక ధరలో వచ్చే లాంగ్ వ్యాలిడిటీ అందించే BSNL ప్లాన్స్
నెలకు కేవలం రూ. 100 ఖర్చుతో కూడా మీరు ఈ ప్లాన్ లను ఎంచుకోవచ్చు.
తక్కువ ఖర్చులో కాలింగ్, డేటా మరియు ఇతర ప్రయోజాలను అందుకోండి
BSNL Best Plans: చవక ధరలో వచ్చే లాంగ్ వ్యాలిడిటీ అందించే ప్లాన్స్ కోసం చూస్తున్నట్లయితే, మీకు మంచి ఆప్షన్ లను బిఎస్ఎన్ఎల్ అందిస్తోంది. నెలకు కేవలం రూ. 100 ఖర్చుతో కూడా మీరు ఈ ప్లాన్ లను ఎంచుకోవచ్చంటే మీరు అర్ధం చేసుకోవచ్చు ఈ ప్లాన్స్ ఎంత చవక ధరలో వస్తాయో. చాలా తక్కువ ఖర్చులో కాలింగ్ డేటా మరియు ఇతర ప్రయోజాలను దీర్ఘకాలం అందించే ప్లాన్స్ గురించి ఈరోజు తెలుసుకోండి.
SurveyBSNL Best Plans:
ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా కొన్ని అతి చవక లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ లను బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అందించింది. అందులో, రూ. 999, రూ. 1,198 మరియు రూ. 1,499 ప్రీపెయిడ్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ ఉన్నాయి. ఈ బెస్ట్ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
బిఎస్ఎన్ఎల్ రూ. 999 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్లాన్ 200 రోజులు చెల్లబాటుగా అవుతుంది. ఈ ప్లాన్ తో 200 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం అంధిస్తుంది మరియు 2 నెలల పాటు ఉచిత PRBT ని కూడా అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో డేటాని జత చెయ్యలేదు బిఎస్ఎన్ఎల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లు 1MB డేటా కోసం 25p చెల్లించవలసి ఉంటుంది.
బిఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్ పూర్తిగా సంవత్సరం మొత్తం చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో నెలకు 300 మినిట్స్ కాలింగ్, నెలకు 3GB మరియు నెలకు 30SMS ల చొప్పున 12 నెలల పాటు బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది. ఈ ప్లాన్ లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలను కొరకునే వారికి తక్కువ ధరలో వచ్చే బెస్ట్ ఐ ఇయర్ ప్లాన్ అవుతుంది.
బిఎస్ఎన్ఎల్ రూ. 1,499 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 1,499 ప్లాన్ కూడా పూర్తిగా 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ తో 336 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ను రోజుకు 100SMS ల ఉపయోగ ప్రయోజనాలను బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో టోటల్ 24GB డేటా మాత్రమే లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ దీర్ఘకాలం వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ కాలింగ్ కోరుకునే వారికి మంచి ఆప్షన్ అవుతుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile