BSNL Long Plan which offers one year benefits at budget price
BSNL Long Plan: బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం ఇండస్ట్రీ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించింది. లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం కూడా చాలా బెస్ట్ ప్లాన్స్ అందించింది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఒకసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం ఆనందించవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ బడ్జెట్ ధరలో రావడమే కాదు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తాయి. బిఎస్ఎన్ఎల్ యూజర్ల అద్భుతమైన లాభాలు అందించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
బిఎస్ఎన్ఎల్ చాలా కాలంగా యూజర్ల కోసం అందుబాటులో ఉంచిన వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,399 బెస్ట్ బడ్జెట్ వన్ ఇయర్ ప్లాన్ గా ఉంటుంది. ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ కోసం యూజర్లు చెల్లించే అమౌంట్ ను 12 నెలలకు విభజిస్తే నెలకు కేవలం రూ. 200 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే, ఈ బిఎస్ఎన్ఎల్ లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే లాభాలు మాత్రం అనేకం.
Also Read: కేవలం 9 వేల బడ్జెట్ లోనే boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ పూర్తి 365 రోజులు చెల్లుబాటు కాలానికి గాను యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్ అందుకుంటారు. కేవలం కాలింగ్ మాత్రమే కాదు డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా తో పాటు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.అదనంగా, ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps స్పీడ్ తో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ డేటా ఉచితంగా ఆఫర్ చేస్తుంది.
అంటే, ఈ బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు నెలకు కేవలం రూ. 200 రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ మరియు SMS లాభాలు అందుతాయి. ఇక ఇదే ప్రయోజనాలతో ఎక్కువ డేటా అందించే మరో ప్రీపెయిడ్ ప్లాన్ కూడా మీకు అందుబాటులో ఉంది. అదే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 2,799 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పైన తెలిపిన రూ. 2,399 అందించే అన్ని ప్రయోజనాలు అందిస్తుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు డైలీ 3జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది.